Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్ 3' లో టాలీవుడ్ యంగ్ హీరో..!

By:  Tupaki Desk   |   26 Aug 2021 11:21 AM GMT
ఫ్యామిలీ మ్యాన్ 3 లో టాలీవుడ్ యంగ్ హీరో..!
X
విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్.. ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 2019లో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో సందీప్ నటించారు. దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందించిన ఈ సిరీస్ లో మేజర్ విక్రమ్‌ గా సందీప్ కనిపించాడు. అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ సిరీస్ లో సందీప్ పాత్ర నిడివి తక్కువే అయిన్నప్పటికీ.. అది మంచి అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మరోసారి ఈ ఫ్యామిలీ సిరీస్ లో భాగం అవుతున్నట్లు యువ హీరో తెలిపారు.

'ది ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ సీజన్ లో ఉన్న సందీప్ కిషన్ సీజన్-2 లో కనిపించలేదు. రెండో సీజన్ ద్వారా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నేపథ్యానికి సందీప్ పాత్ర అవసరం లేకపోవడంతో అతన్ని దూరం పెట్టారు. అయితే రాబోయే సీజన్ ను నార్త్ ఈస్ట్ లో ప్లాన్ చేయబడిన ఫ్యామిలీ మ్యాన్ లో సందీప్ కిషన్ నటించే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్.. రాజ్ - డీకే రూపొందించే 'ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ లో కీలక పాత్ర పోషించే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

పన్నెండేళ్ళుగా కష్ట పడుతున్న తనకు ఇప్పుడిప్పుడే తగిన ఫలితం లభిస్తుందని.. ఈ వెబ్ సిరీస్ కూడా అందులో భాగమేనని సందీప్ చెప్పాడు. మూడవ సీజన్ 2022 లో సెట్స్ మీదకు వెళ్లనుంది. రెండో సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో 'ఫ్యామిలీ మ్యాన్ 3' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి సందీప్ కిషన్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కంటే ముందు సందీప్ కిషన్ పలు ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయనున్నాడు.

నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'గల్లీ రౌడీ' సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. దీని తర్వాత ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ లో సందీప్ ఓ సినిమా చేయనున్నాడు. ఇకపోతే హాస్య నటుడు సత్య ని హీరోగా పరిచయం చేస్తూ సందీప్ నిర్మించిన 'వివాహ భోజనంబు' చిత్రం ఆగస్టు 27న డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతోంది. ఇది సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఫస్ట్ తెలుగు కొత్త సినిమా అని తెలుస్తోంది.