Begin typing your search above and press return to search.
ప్రమోషన్ల నుండి భలే తప్పించుకుంటున్నారే
By: Tupaki Desk | 7 March 2018 11:30 PM GMTఈ మధ్య కాలంలో ప్రోమోషన్లు ఎంత గట్టిగా చేస్తే సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. డైరెక్టర్లు - ప్రొడ్యూసర్లు కంటే సినిమా హీరో ప్రమోట్ చేస్తేనే ప్రేక్షకులు కొంచెం త్వరగా కనెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడున్న హీరోలు వారు చేసిన సినిమానే అయినా మాది కాదు అన్నట్టు ప్రమోషన్లు పక్కన పెడితే కనీసం సినిమా పేరు కూడా ఎత్తట్లేదు.
అందులో మొదట చెప్పుకోవాల్సింది విజయ్ దేవేరకొండ గురించి. అర్జున్ రెడ్డి సినిమా తో తన ఫేట్ పూర్తిగా మార్చేసుకున్నాడు. కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హిట్ అవ్వలేదు. పెళ్లి చూపులతో లైం లైట్ లోకి వచ్చి అర్జున్ రెడ్డి తో స్టార్ అయిపోయాడు విజయ్. అంతకు ముందు తను నటించిన సినిమాలలో ఒకటైన ఏ మంత్రం వేసావే అప్పట్లో కొన్ని ఇబ్బందుల వల్ల అటకెక్కింది కాని విజయ్ కు స్టార్డమ్ వచ్చాక మళ్ళీ రిలీజ్ కు సిద్ధం చేశారు. సినిమాలో తానే హీరోగా నటించినా కనీసం ఆ సినిమా పోస్టర్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన పాపాన పోలేదు విజయ్. ఏమి అడిగినా నో కామెంట్స్ అంటూ దాటేస్తున్న ఈ హీరో మీద చిత్ర ప్రొడ్యూసర్లు విరుచుకుపడుతున్నారు. సినిమా తనదే కాబట్టి తాను ప్రమోట్ చేయడానికి ఇప్పటికైనా వస్తాడేమో అని ఆశగా చూస్తున్నారు.
విజయ్ లాంటి వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీ లో. నివేద థామస్ తొలి చిత్రం కూడా తెలుగులో జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ అవ్వాల్సి ఉంది. కానీ అది రిలీజ్ అయ్యేముందే జెంటిల్ మాన్ - నిన్నుకొరి - జై లవ కుశ తో స్టార్ అయిపోయింది. ఇంకా ఈ సినిమా గురించి పెదవి కూడా విప్పలేదు. అటు నాగ శౌర్య కూడా తన మొదటి సినిమా నీ జాతలేక విడుదల అయ్యేలోపే సక్సెస్ లు కొట్టేసి ఈ సినిమా ప్రోమోషన్లకు వెళ్లనుకూడా వెళ్ళలేదు.
ఇక శర్వానంద్ కూడా తక్కువ తినలేదు. రాజాధి రాజా సినిమా ను ప్రమోట్ చెయ్యలేదు. ఇందులో మరీ ఘోరం ఏంటంటే ఆ సినిమా తెలుగులో విడుదల అయింది కానీ తమిళ వెర్షన్ అయితే డైరెక్ట్ డీవీడీలే విడుదల చేశారు. సినిమా బావున్నా లేకపోయినా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల కోసమైనా ప్రమోషన్లు చెయ్యాలి కదా బాస్. ఇలా అయితే ఎలా?