Begin typing your search above and press return to search.

అచ్చిరాని విద్యకు దూరంగా యూత్ హీరోలు

By:  Tupaki Desk   |   6 Feb 2019 6:11 AM GMT
అచ్చిరాని విద్యకు దూరంగా యూత్ హీరోలు
X
ఒకప్పుడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్-ఎఎన్ ఆర్ లాంటి అగ్ర హీరోలు ఒకవైపు సినిమాల్లో ఊపిరి సలపలేనంత బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాణ వ్యవహారాలను సైతం చురుగ్గా చూసుకునే వాళ్ళు. అందుకే రామకృష్ణ సినీ స్టూడియోస్-అన్నపూర్ణ బ్యానర్లు మరపురాని ఎన్నో గొప్ప క్లాసిక్స్ ని అందించాయి. ఎన్టీఆర్ ఏకంగా దర్శకత్వ బాధ్యతలు సైతం మోసేవారు. తర్వాత కృష్ణ మరో సువర్ణ శకం. సాహసానికి మారుపేరుగా ఉంటూ టాలీవుడ్ ఎవరూ చేయనన్ని ప్రయోగాలు తన పద్మాలయ సంస్థ ద్వారా నిర్మించి అశేషమైన ఖ్యాతిని ఆర్జించారు.

తర్వాత తరం ఇంత సమర్ధవంతంగా ఈ బాధ్యతలు మోయలేకపోయింది. బాలయ్య వంద సినిమాలు అయ్యాక కానీ తన పేరు మీద బ్యానర్ ను స్థాపించలేకపోయాడు. చిరంజీవి పేరు మీద నిర్మాతగా ఏ ఒక్క సినిమా రాలేదు. తమ్ముడు నాగబాబు అబ్బాయి రామ్ చరణ్ లను నిర్మాతలను చేసారు తప్పించి మెగాస్టార్ గానే కొనసాగారు. ఇక నాగార్జున కొంతమేర నిర్మాతగా తన ముద్ర వేశారు కానీ అది కొంత కాలమే. ఇక వెంకటేష్ బాధ్యతలు మొత్తం అన్నయ్య సురేష్ బాబుకే అప్పగించారు.

ఇక ఇప్పటి జెనరేషన్ యూత్ హీరోలు సైతం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి సత్ఫలితాలను ఇవ్వలేక వాళ్ళను కేవలం నటనే పరిమితం చేస్తున్నాయి. నితిన్ ఎంతో ముచ్చటపడి అఖిల్ లాంచింగ్ బాధ్యతలు నెత్తిన వేసుకుంటే అది ఇచ్చిన నష్టాలకు ఇప్పటికీ పూర్తిగా కోలుకున్నాడో లేదో అనుమానమే. ఇక సుధీర్ బాబు చేసిన ప్రయత్నం నన్ను దోచుకుందువటేతో పేరు ఇచ్చింది కానీ డబ్బులు మాత్రం తేలేదు. నాగశౌర్య ఛలో ఇచ్చిన కిక్కుతో కథను పూర్తిగా చెక్ చేసుకోకుండా @నర్తనశాల చేసి అంతకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. ఇక రామ్ సంగతి సరేసరి. సందీప్ కిషన్ లాంటి వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ రెండు పడవల ప్రయాణం ఇప్పటి యూత్ హీరోలకు సవాల్ గా మారింది. అందుకే సవారి చేయలేక మధ్యలోనే డ్రాప్ అయిపోయి హీరో కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. అందుకే అనేది అప్పటి రోజులే వేరు అని. అది బయట సమాజానికే కాదు సినిమా పరిశ్రమకూ వర్తిస్తుంది