Begin typing your search above and press return to search.
టాలీవుడ్ యువ ప్రతిభావంతులు
By: Tupaki Desk | 14 Feb 2022 6:28 AM GMTటాలీవుడ్‌లో ప్రస్తుతం నూతనోత్తేజం కనిపిస్తోంది. సినిమాల బిజినెస్ పరంగా, మార్కెట్ స్థాయి పెరగడంతో పాటు మన సినిమా అంటే ఇప్పుడు యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజులివి. ఇది టాలీవుడ్ కు నిజంగా శుభపరిణామం. ఇదే సందర్భంలో యువ హీరోలు కూడా డ్యూయల్ రోల్ పోషిస్తూ మన ప్రతిభని వెండితెరపైనే కాకుండా వెరవెనక కూడా చూపిస్తూ సినిమా విజయాల్లో తమ వంత బాధ్యతని సక్సెస్ ఫుల్ గా నెరవేరుస్తుండటం ఆకట్టుకుంటోంది.
ఓ సినిమాలో ఇంతకు ముందు హీరోగా నటిస్తే కొంత మంది హీరోలు దర్శకుడు చెప్పింది చేయడం గురించే ఆలోచించేవాళ్లు.. కానీ నేటి తరం యువ హీరోలు మాత్రం అలా కాకుండా కథ, కథనం, డైలాగ్స్ విషయాల్లోనూ తమ ప్రతిభని చూపిస్తున్నారు. ప్రస్తుంత ఇలాంటి హీరోల ప్రవాహం టాలీవుడ్ లో రోజు రోజుకీ పెరిగిపోతోంది. విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ వంటి హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ప్రవేశించిన స్వతహాగా ఎదుగుతున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా తమ ప్రతిభని పనిచయం చేస్తూ స్టోరీకి సంబంధించిన విలువైన ఇన్ పుట్‌లని అందిస్తూ చిత్ర విజాయాల్లో తమ వంతు పాత్రని పోషిస్తున్నారు. ఈ యువ హీరోల్లో చాలా మంది రచయితలు కూడా వుండటం శుభ పరిణామంగా చెబుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో విజయ్ దేవరకొండ చేసిన చిత్రం `పెళ్లి చూపులు`. తరుణ్ భాస్కర్ దర్శకుడు. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో విజయ్ దేవరకొండ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కొన్ని ఇన్ పుట్ లు అందించాడట. అంతే కాకుండా సెన్సేషనల్ హిట్ గా నిలిచిన `అర్జున్‌రెడ్డి` స్క్రిప్ట్ విషయంలోనూ దర్శకుడిగా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని టాక్.
ఇక నవీన్ పొలిశెట్టి `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అంతుకు ముందు `ఆల్ ఇండియా బాక్చోడ్` అనే హిందీ షోతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. తను హాస్య చతురత వున్న మంచి రచయిత కూడా. ఇదే అతన్ని `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` స్క్రిప్ట్ లో తన వంతు పాత్రని సమర్ధవంతంగా పోషించేలా చేసి సినిమా విజయంలో భాగస్వామిగా నిలబెట్టింది.
ఇదే తరహాలో యంగ్ హీరో అడివి శేష్ కూడా తను నటించే చిత్రాల స్క్రిప్ట్ ల విషయంలో ఇన్ పుల్ లు ఇస్తుంటాడు. ఇప్పుడు వీరి బాటలోనే యువ హీరో సిద్దూ జొన్నలగడ్డ కూడా పయనిస్తున్నాడు. `గుంటూర్ టాకీస్` చిత్రం నుంచి హీరో సిద్దూ జొన్నలగట్ట తన చిత్రాలకు రచియితగా కూడా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత చేసిన `కృష్ణ అండ్ హిస్ లీలా`.. మా వింత గాధ వినుమ చిత్రాలకు రచయితగా కూడా తన వంతు సహకారాన్ని అందించాడు.
తాజాగా `డీజే టిల్లు` చిత్రానికి దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి రచనా సహకారం అందించాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ మూవీ తిరుగులేని విజయాన్ని అందించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇలా విజయ్ దేవరకొండ టు సిద్ధూ వరకు యంగ్ హీరోలంతా తమ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయాల్లోనూ పాలుపంచుకుంటూ డ్యుయెల్ రోల్ పోషించడం.. అవి సూపర్ హిట్ లుగా నిలవడం శుభపరిణమంగా చెబుతున్నారు. యంగ్ హీరోల్లో అత్యధిక భాగం స్క్రిప్ట్ దశ నుంచే ఇన్‌వాల్వ్ అవుతుండటంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు విభిన్నమైన చిత్రాలొస్తున్నాయని, ఇది ఇలాగే కొనసాగాలని అంతా అంటున్నారు.