Begin typing your search above and press return to search.
`శ్యామ్ సింగ రాయ్` బిహైండ్ ద సీన్స్
By: Tupaki Desk | 23 Dec 2021 2:57 PM GMTనేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నాని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన `శ్యామ్ సింగ రాయ్ బిహైండ్ ద సీన్స్` పేరుతో చిత్ర బృందం గురువారం ఓ వీడియోని విడుదల చేసింది.
కోల్ కొత వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన కాళికామాత హౌస్ సెట్.. విగ్రహం.. సెట్ లో షూటింగ్ కోసం టీమ్ తీసుకున్న జాగ్రత్తలు.. 1970 నేపథ్యంలో సాగే కోల్ కతా సన్నివేశాల కోసం ఆ నాటి కాలాన్ని తలపిస్తూ వేసిన సెట్ లు ...సాయి పల్లవి నృత్యం చేసే సందర్భంగలో వచ్చే నటరాజ విగ్రహం...ఆ నాటి కార్.. పడవలోంచి నాని నదిలోకి దూకుతున్న సన్నివేశాలు.. శ్యామ్ సింగ రాయ్ ఎపిసోడ్ లో నాని పాత్ర చేసే పోరటా ఘట్టాలు...
కథలో కీలక సన్నివేశాల్లో అలనాటి వాతావరణాన్ని గుర్తు చేసే సెట్టింగ్ ల కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ పడిన శ్రమ.. సినిమాలలోని కీలక సందర్భంలో సాయి పల్లవిపై చిత్రీకరించిన `ప్రణవాలయ .. సాంగ్ కోసం త్రిశూలం పట్టుకుని చేసిన రిహార్సల్స్ .. శ్యామ్ సింగ రాయ్ పాత్ర కోసం నాని పెట్టిన ఎఫర్ట్... మార్కెట్ లో జరిగే ఫైట్ .. కోటలోకి నాని రాజ్ దూత్ పై ప్రవేశించే సన్ని వేశాలు... కోల్ కతా వాతావరణాన్ని తలపిస్తూ తీర్చి దిద్దిన వీధులు వెరసి `శ్యామ్ సింగ రాయ్` కోసం టీమ్ ఏ స్థాయిలో శ్రమించిందో తెలియజేస్తున్నాయి.
కొత్త దనానికి పట్టంకట్టే తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాని అందించాలని `శ్యామ్ సింగ రాయ్` టీమ్ పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది. హీరోయిన్ లు కూడా హీరో తో పోటీపడి మరీ ఈ సినిమా కోసం శ్రమించారు. సాయి పల్లవి దేవ దాసీ పాత్ర కోసం చాలానే శ్రమించినట్టుగా కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనమే `ప్రణవాలయ .. గీతం.. ఇదే సినిమాలో విజువల్ ఫీస్ట్ గా మారనుందని ఇప్పటికే సినీ వర్గాలు చెబుతున్నాయి.
నాని నటించిన చిత్రాల్లో సరికొత్త కథ కాథనాలతో రూపొందిన చిత్రమిది. టైమ్ ట్రావెల్ అనే పాయింట్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా నాని ని అభిమానించే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలవుతున్న `శ్యామ్ సింగ రాయ్` నాని నమ్మకాన్ని ఏ మేరకు నిజం చేసి హీరోగా అతని స్టాయిని పెంచుతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.