Begin typing your search above and press return to search.
మంచోడే - కాని అమ్మాయిల పిచ్చి
By: Tupaki Desk | 19 Jan 2019 11:01 AM GMTబాలీవుడ్ లో గత కొంత కాలంగా హీరోయిన్స్ తో పాటు టెక్నీషియన్స్ గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకు తీసుకు వస్తున్న విషయం తెల్సిందే. మీటూ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల జీవితాలు రోడ్డు మీద పడ్డట్లయ్యాయి. ఎంతో మంది పేరున్న వారు పరువు పోగొట్టుకున్నారు. తాజాగా ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ స్వరా భాస్కర్ మాట్లాడుతూ ఒక దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ దర్శకుడి పేరు చెప్పకుండా అతడు తనను ఇబ్బంది పెట్టిన తీరును వివరించింది.
బాలీవుడ్ లో తాను ఒక సినిమాకు పని చేస్తున్న సమయంలో ఆ చిత్ర దర్శకుడు నాతో పలు సార్లు అనుచితంగా ప్రవర్తించాడు. అతడు ఎప్పుడు చూసినా కూడా నాతో ఆ విషయాలను గురించి మాట్లాడుతూ - శారీరక అనుభవం కోరుకుంటున్నట్లుగా చెప్పేవాడు. కాని నేను మాత్రం అతడి నుండి తప్పించుకుంటూ వచ్చేదాన్ని. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా పలు సార్లు ఆయన నాతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో పాటు - కలిసిన ప్రతి సారి కూడా శారీరకంగా వేదించే ప్రయత్నం చేసేవాడు. మంచి దర్శకుడే అయినా కూడా అమ్మాయిల పిచ్చి అతడికి ఎక్కువ అంటూ ఆ దర్శకుడి పేరు చెప్పకుండా స్వరా భాస్కర్ దాటవేసింది.
ఆ వ్యక్తి నన్ను ఆరు సంవత్సరాల పాటు శారీరకంగా - మానసికంగా వేదించాడు. ఆ వ్యక్తిని ఎదిరించలేను, బయటకు చెప్పలేను అంటూ స్వరా భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం మరో దర్శకుడు కూడా నన్ను లైంగికంగా వేదించాడు. ఆ దర్శకుడికి ఆ సమయంలోనే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. ఇండియాలో లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పే అమ్మాయినే దోషిగా జనాలు చూస్తారు. అందుకే అమ్మాయిలు ధైర్యంగా తాను పడ్డ ఇబ్బందులను మరియు లైంగిక వేదింపులను చెప్పేందుకు ముందుకు రారు. ఇప్పుడు మీటూ దయవల్ల కొందరైనా అమ్మాయిలు మీడియా ముందుకు వస్తున్నారు.