Begin typing your search above and press return to search.

ఈ ఏడాది కోట్ల నష్టాలు మిగిల్చిన సినిమాలు

By:  Tupaki Desk   |   21 Dec 2018 3:30 AM GMT
ఈ ఏడాది కోట్ల నష్టాలు మిగిల్చిన సినిమాలు
X
భారీ అంచనాల నడుమ రూపొందే అన్ని సినిమాలు కూడా భారీ విజయాలను దక్కించుకుంటాయనే నమ్మకం ఉండదు. మీడియం బడ్జెట్‌ సినిమాలు ఫ్లాప్‌ అయితే కాస్త నష్టమే ఉంటుంది - కాని భారీ బడ్జెట్‌ సినిమాలు ఫ్లాప్‌ అయితే మాత్రం నష్టం భారీగా ఉంటుంది. నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు కోట్లలో నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో కూడా బాలీవుడ్‌ లో నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు మిగిల్చిన సినిమాలు చాలానే వచ్చాయి. అందులో టాప్‌ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ : 300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం కనీసం ప్రమోషన్‌ ఖర్చులను కూడా రాబట్టలేదు అంటూ సోషల్‌ మీడియాలో తెగ మీమ్స్‌ వచ్చాయి. ఈమద్య కాలంలో అమీర్‌ ఖాన్‌ నటించిన సినిమాల్లో ఇదే అతి పెద్ద డిజాస్టర్‌. ఈ ఏడాది ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో కూడా ఇదే అతి పెద్ద డిజాస్టర్‌ గా - ఎక్కువ నష్టాలు మిగిల్చిన మూవీగా నిలిచింది.

2. రేస్‌ 3 : గతంలో వచ్చిన రేస్‌ రెండు సిరీస్‌ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దాదాపు 185 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించారు. కాని ఈ చిత్రం కనీసం 100 కోట్ల షేర్‌ ను కూడా రాబట్టలేక పోయింది.

3. నమస్తే ఇంగ్లాండ్‌ : 54 కోట్లతో రూపొందిన ఈ చిత్రం కనీసం 10 కోట్ల షేర్‌ ను కూడా వసూళ్లు చేయలేక పోయింది. అర్జున్‌ కపూర్‌ మరియు పరిణితి చోప్రాలు ఈ చిత్రంలో నటించి మెప్పించలేక పోయారు.

4. బట్టి గుల్‌ మీటర్‌ చాలు : షాహిద్‌ కపూర్‌ - శ్రద్దా కపూర్‌ లు నటించిన ఈ చిత్రం దాదాపు 50 కోట్లతో నిర్మించారు. 25 కోట్ల షేర్‌ ను మాత్రమే ఈ చిత్రం రాబట్టినట్లుగా తెలుస్తోంది.

5. అయ్యారీ : సిద్దార్థ్‌ మల్హోత్రా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం 65 కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. కేవలం 15 కోట్లను మాత్రమే ఈ చిత్రం వెనక్కు తీసుకు రాగలిగింది.

6. ఫన్నే ఖాన్‌ : అనీల్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ లు కలిసి నటించిన ఈ చిత్రం కేవలం 40 కోట్ల బడ్జెట్‌ తోనే తెరకెక్కింది. ఐశ్వర్యరాయ్‌ ఉన్నా కూడా ఈ చిత్రం కనీసం 10 కోట్లను కూడా రాబట్టలేక పోయింది.

7. పల్టాన్‌ : జాకీ ష్రాప్‌, అర్జున్‌ రామ్‌ పాల్‌ లు నటించిన ఈ చిత్రం కేవలం 15 కోట్లతోనే రూపొందింది. ఆ మొత్తాన్ని కూడా తీసుకు రాలేక పోయింది. కేవలం అయిదు కోట్లు మాత్రమే వసూళ్లు అయినట్లుగా సమాచారం.

8. హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగి : సోనాక్షి సిన్హా నటించిన ఈ చిత్రం బడ్జెట్‌ 30 కోట్లు. ఈచిత్రం కేవలం 20 కోట్లను మాత్రమే రాబట్టింది.

9. కాలాకండి : సైఫ్‌ అలీఖాన్‌ వంటి స్టార్‌ నటించిన ఈ చిత్రం 20 కోట్లతో రూపొందింది. బాక్సాఫీస్‌ వద్ద కేవలం అయిదు కోట్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టింది.

10. ఒమెర్టా : టెర్రరిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 12 కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. కాని బాక్సాఫీస్‌ వద్ద కేవలం 3 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది.