Begin typing your search above and press return to search.

టాప్ 10 హాలీవుడ్ రిలీజెస్‌

By:  Tupaki Desk   |   28 Feb 2019 10:40 AM IST
టాప్ 10 హాలీవుడ్ రిలీజెస్‌
X
గ‌త ఏడాది రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన హాలీవుడ్ సినిమాలెన్నో. బ్లాక్ పాంథ‌ర్, అవెంజ‌ర్స్ 2, ఆక్వామేన్, యాంట్ మేన్ 2 .. ఇలా ఎన్నో విజువ‌ల్ వండ‌ర్స్ వ‌చ్చి భారీగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టాయి. ఇండియా నుంచి రూ.300- రూ.500 కోట్లు కొల్ల‌గొట్టే ద‌మ్ము ఉంద‌ని హాలీవుడ్ సినిమాలు నిరూపించాయి. అందుకే మునుముందు బ‌రిలో దిగుతున్న భారీ చిత్రాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఇక‌పై రిలీజ్ ల‌కు రానున్న చిత్రాల్లో రెండు డ‌జ‌న్ల సినిమాల‌పై జ‌నాల్లో ఎంతో క్యూరియాసిటీ నెల‌కొంది. ఈ ఏడాదితో పాటు, రానున్న రెండు మూడేళ్ల‌లో ఈ సినిమాల‌న్నీ వేడి పెంచ‌నున్నాయి.

అవెంజ‌ర్స్ 4 చిత్రం ఈ ఏడాది మే 3న రిలీజ‌వుతోంది. అలాగే స్టార్ వార్స్ : ఎపిసోడ్ 9 డిసెంబ‌ర్ 20న రిలీజ‌వుతోంది. ఇట్‌: చాప్ట‌ర్ 2 సెప్టెంబ‌ర్ 6న రిలీజ‌వుతోంది. ఫ్రోజెన్ 2, ది లెగో 2, వండ‌ర్ ఉమెన్ 2, కెప్టెన్ మార్వ‌ల్, లైన్ కింగ్ (లైవ్ యాక్ష‌న్) వంటి చిత్రాలు త్వ‌ర‌లో రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. షాజ‌మ్ ఏప్రిల్ లో రిలీజ‌వుతోంది. వీట‌న్నిటికీ సంబంధించిన టీజ‌ర్ లు, ట్రైల‌ర్లు ఇప్ప‌టికే వేడి పెంచుతున్నాయి. మునుముందు కొత్త ట్రైల‌ర్ల‌తో మ‌రింత‌గా వేడి పెంచ‌నున్నారు.

వీటికి తోడు మ‌రిన్ని భారీ చిత్రాల రిలీజ్ ల‌కు తేదీల్ని ఖ‌రారు చేయ‌డం విశేషం. వండ‌ర్ ఉమెన్ సీక్వెల్ `వండ‌ర్ ఉమెన్ 1984` చిత్రం జూన్ 2020లో రిలీజ్ కానుంద‌ని ప్ర‌క‌టించారు. మ‌రో సీక్వెల్ సినిమా `ది బ్యాట్‌మేన్‌` జూన్ 2021లో రిలీజ‌వుతుంది. ఆక్వామేన్ 2 చిత్రం డిసెంబ‌ర్ 2022లో రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ది సూసైడ్ స్క్వాడ్ ఆగ‌స్టు 2021 ముహూర్తం నిర్ణ‌యించారు. బ‌ర్డ్స్ ఆఫ్ ప్రే ఫిబ్ర‌వ‌రి 2020లో రిలీజ్ కానుంది. బ్యాట్ మేన్, అవెంజ‌ర్స్, ఆక్వామేన్, వండ‌ర్ ఉమెన్ సీక్వెల్ చిత్రాల కోసం ఇండియాలోనూ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తుంటార‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్ప‌డానికి ఛాన్సుంది. గ‌త ఏడాది రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన బ్లాక్ పాంథ‌ర్ చిత్రానికి 2019 ఆస్కార్ అవార్డు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇండియాలో రిలీజ‌య్యే టాప్ 10 హాలీవుడ్ సినిమాలేవీ అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.