Begin typing your search above and press return to search.

టాప్ 10 `క‌ళైమామణి` బ్యూటీస్‌

By:  Tupaki Desk   |   1 March 2019 11:32 AM IST
టాప్ 10 `క‌ళైమామణి` బ్యూటీస్‌
X
త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌క క‌ళైమామ‌ణి అవార్డ్స్ (2011 - 2018 ) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల‌లో 24 క్రాఫ్టుల్లో ప‌నిత‌నం క‌న‌బ‌రిచిన వారికి ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాల్ని అందించారు. క‌ళ‌ల విభాగంలో ఈ పుర‌స్కారం ద‌క్కించుకున్నారు. అయితే ఈసారి అవార్డుల్లో సీనియ‌ర్ క‌థానాయిక, జాతీయ ఉత్త‌మ‌న‌టి ప్రియ‌మ‌ణి పేరు వినిపించింది. ఇంత‌వ‌ర‌కూ సౌత్ హీరోయిన్ల‌లో ఎంత‌మంది క‌ళైమామ‌ణి అవార్డు అందుకున్నారు? అన్న‌ది ప‌రిశీలిస్తే .. టాప్ 10 క‌థానాయిక‌ల జాబితా అందుబాటులో ఉంది. హీరోయిన్ల‌తో పాటు, ప‌లువురు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు, సీనియ‌ర్ గాయ‌ణీమ‌ణులు ఈ పుర‌స్కారాల్ని ద‌క్కించుకున్నారు. త‌మిళంలో ల‌బ్ధ ప్ర‌తిష్టులైన ఎంద‌రో హీరోలు క‌ళైమామ‌ణి అవార్డులు గెలుచుకున్నారు.

గ‌తంలో క‌ళైమామ‌ణి పుర‌స్కారాలు అందుకున్న నాయిక‌లు జాబితా ప‌రిశీలిస్తే.. సావిత్రి- దేవ‌యాని- నయ‌న‌తార‌- అనుష్క‌- త్రిష‌- సిమ్ర‌న్- జ్యోతిక- అసిన్- త‌మ‌న్నా- మీనా- స్నేహ‌- శ్రీయ త‌దిత‌రులు ఉన్నారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ మ‌నోర‌మ‌, గాయ‌ని చిత్ర‌- నిర్మాత ఐశ్వ‌ర్య ధ‌నుష్‌- న‌టి- ద‌ర్శ‌క‌నిర్మాత‌ రేవ‌తి త‌దిత‌రులు ఉన్నారు. వీళ్ల‌తో పాటు ఇంకా ఎంద‌రో న‌టీమ‌ణుల పేర్లు క‌ళైమామ‌ణి అవార్డులు అందుకున్న వారి జాబితాలో ఉన్నాయి.

ఈ అవార్డులు అందుకున్న హీరోల పేర్లు ప‌రిశీలిస్తే.. ర‌జ‌నీకాంత్- క‌మ‌ల్ హాస‌న్- సూర్య‌- విక్ర‌మ్- విజ‌య్‌- విజ‌య్ కాంత్- అజిత్ త‌దిత‌రులు.. ఉన్నారు. స్వ‌ర‌మాంత్రికుడు .. ఆస్కార్ గ్ర‌హీత‌ ఏ ఆర్ రెహ‌మాన్.. అలానే జాతీయ అవార్డు సినిమా తీసిన‌ చేర‌న్ ఈ లిస్ట్ లో నిలిచారు. ఇంకా ఎంద‌రో ఉన్నారు. 1954 నుంచి త‌మిళ‌నాడులో ఈ అవార్డుల్ని ఇస్తున్నారు. త‌మిళనాడు ఇయ‌ల్ ఇసై నాట‌క మండ్ర‌మ్ (లిట‌రేచ‌ర్- మ్యూజిక్ & థియేట‌ర్) త‌ర‌పున ఈ పుర‌స్కారాల్ని క‌ళారంగానికి అందిస్తున్నారు. సినిమా క‌ళారంగంలో ఒక విభాగం కాబ‌ట్టి ఆ రంగం ప్ర‌ముఖుల‌కు ఈ పుర‌స్కారాలు ద‌క్కుతున్నాయి.