Begin typing your search above and press return to search.

2022లో దేశంలో టాప్ 6 OTTల పెట్టుబ‌డులు?

By:  Tupaki Desk   |   4 Jan 2023 2:30 AM GMT
2022లో దేశంలో టాప్ 6 OTTల పెట్టుబ‌డులు?
X
ఒక‌ప్పుడు వినోదం కోసం పెద్ద‌తెర - బుల్లితెరను అనుస‌రించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ సిరీస్ లు కూడా వినోదంలో భాగం. డిజిట‌ల్ వినోదం అనంతంగా ప్ర‌జ‌ల హృద‌యాల‌ను ఆక్ర‌మించేస్తోంది. భారతీయ వినోద ప్రియులు ఇంతకుముందు సినిమాలు టీవీ సీరియ‌ళ్లు మాత్ర‌మే వీక్షించేవారు. గత రెండేళ్లలో సీన్ అంతా మారింది. ప్ర‌జ‌లు వెబ్ సిరీస్ లు మినీ-సిరీస్ లను వీక్షించ‌డాన్ని కూడా అలవాటు చేసుకున్నారు.

సైఫ్ అలీ ఖాన్ - నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన సేక్రేడ్ గేమ్స్ (2018) మొదటి సీజన్ విజయం సాధించిన తర్వాత ఈ ట్రెండ్ మ‌రింత పుంజుకుంది. లాక్ డౌన్ సమయంలో అది వేగవంతమైంది. ఓటీటీల‌కు సబ్ స్క్రైబర్ లు అనూహ్యంగా పెరిగారు.  స్ట్రీమింగ్ దిగ్గజాలు క్వాంటిటీ కంటే నాణ్యమైన షోలు సిరీస్ ల‌ను ఒరిజిన‌ల్ సినిమాల‌ను అందించేందుకు ఆలోచించాల్సిన స‌న్నివేశం క్రియేటైంది. పోటీ పెర‌గ‌డంతో అనూహ్యంగా ఒరిజిన‌ల్ కంటెంట్ క్రియేట‌ర్స్ ఈ రంగంలో రారాజుగా మారుతున్నారు. అదే క్ర‌మంలో ఒరిజిన‌ల్ కంటెంట్ ను రూపొందించడానికి చాలా డబ్బును పెట్టుబ‌డులుగా వెద‌జ‌ల్లుతున్నారు.

ది ఎకనామిక్ టైమ్స్ క‌థ‌నం ప్రకారం భారతదేశంలోని ఆరు ప్రధాన OTT ప్లాట్ ఫారమ్ లు 2022లో ఒరిజిన‌ల్ షోల‌ను రూపొందించడానికి 600 మిలియన్ డాల‌ర్ల నుంచి 700 మిలియన్ డాల‌ర్ల‌ను ఖర్చు చేశాయని పేర్కొంది. మరో మాటలో చెప్పాలంటే ఓటీటీ ప్లేయ‌ర్స్ రూ. 4968 కోట్ల పెట్టుబ‌డుల్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ కోసం ఖ‌ర్చు చేయ‌గా.. కొత్త కంటెంట్ చేయడానికి ఓవ‌రాల్ గా 5796 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని స‌మాచారం. టాప్ 6 OTT ఇండియన్ ప్లాట్ ఫారమ్ లు 2022లో ఒరిజినల్ షోలను నిర్మించడానికి రూ.5000 కోట్లు ఖ‌ర్చు చేసాయ‌ని లెక్క‌లు చెబుతున్నారు.
ఈ టాప్ ఆరు ప్లాట్ ఫారమ్ ల‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో - నెట్ ఫ్లిక్స్ ఇండియా- డిస్నీ+ హాట్‌స్టార్- సోనీ LIV- జీ5 -వూట్ ఉన్నాయి. పైన చెప్పిన‌ట్టుగా మొత్తం ఒరిజినల్ సినిమాలు లేదా స్పోర్ట్స్ కంటెంట్ పై పెట్టిన‌ పెట్టుబడిని  మినహాయించి వేసిన లెక్క‌లు అవి.

ఆసక్తికరంగా 2022 లో నెట్ ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ భారతదేశంలో త‌మ ఓటీటీ వృద్ధి చెంద‌క‌పోవ‌డంపై నిరాశను వ్య‌క్తం చేశారు. నెట్ ఫ్లిక్స్ కంటే అమెజాన్ ప్రైమ్ ఇండియాలో స్పీడ్ మీద ఉంది. కొన్ని ఆచరణాత్మక కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ OTT దిగ్గజాలు పాపుల‌ర్‌ షోలకు సంబంధించిన‌ తదుపరి సీజన్ లను రద్దు చేశాయని ఈ సంవత్సరం వినడం సర్వసాధారణం. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లు 2020 నియ‌మాల అనుస‌ర‌ణ ప్ర‌కారం... డైరెక్ట్-టు-డిజిటల్ విడుదల కోసం సినిమాలను కొనుగోలు చేయడం ఆపివేసినట్లు తెలుస్తోంది.

అయితే అదే సమయంలో కంటెంట్ ని తగ్గించడానికి ఓటీటీలు ఇష్టపడవు. వీక్ష‌కులు పుష్క‌లంగా ఉన్నందున షోలు- సినిమాల కోసం  నిధులు సమకూర్చడం కొనసాగించాలని కోరుకుంటున్నాయి. ఇది ఈ రంగంపై ఆధార‌ప‌డిన వారి ఆశను సజీవంగా ఉంచుతుంది. ఏప్రిల్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ తో ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైంది. దీనిలో వారు హిందీ- తమిళం - తెలుగులో 40 కొత్త షోలు సినిమాలను ప్రారంభించారు. నెట్ ఫ్లిక్స్ సైతం త‌మ భారీ ప్ర‌ణాళిక‌ల గురించి వెల్ల‌డించింది.

2022లో భారతదేశంలో ఆన్‌లైన్ వీడియో కంటెంట్ పెట్టుబడి 1.3 బిలియన్ల డాల‌ర్లుగా ఉండ‌గా... 2027 నాటికి 4.2 బిలియన్ల డాల‌ర్ల‌కు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మీడియా పార్టనర్స్ ఆసియా అంచనా వేసినట్లు ప్ర‌ధాన జాతీయ ప‌త్రిక‌లో క‌థ‌నం వెలువ‌డింది. 2022లో సబ్ స్క్రైబర్ లు పెరిగారు. Ormax OTT ఆడియన్స్ సైజింగ్ రిపోర్ట్ 2022 ప్రకారం.. భారతదేశంలో 13.20 కోట్ల SVOD (సబ్ స్క్రిప్షన్ వీడియో-ఆన్-డిమాండ్) ప్రేక్షకులు ఉన్నారు. 2021లో ఈ సంఖ్య 11.50 కోట్లు. అంటే ఏకంగా 1.8 కోట్ల మంది అమాంతం పెరిగారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.