Begin typing your search above and press return to search.
#DRUGS కేసులో ఎస్కేప్ అయ్యేందుకు ఆ నలుగురి ప్లాన్?
By: Tupaki Desk | 24 Sep 2020 3:30 AM GMTబాలీవుడ్ లో మాదకద్రవ్యాల డొంకను కదిలించి ఎన్.సిబి విరామం ఇవ్వకుండా విచారిస్తోంది. తమపై చర్యలు తీసుకుంటారనే భయంతో ఆరుగురు టాప్ బాలీవుడ్ స్టార్లు తమ న్యాయవాదులను ముందుగానే పిలిపించి వ్యూహం రచించమని చెప్పినట్టు ప్రముఖ జాతీయ మీడియా నెట్‌వర్క్ వెల్లడించింది.
అనేక మంది తారలు తదుపరి కార్యాచరణకు ముందస్తు ప్రణాళికను రూపొందించడానికి తమ వంతు కృషి చేస్తున్నారని లీకులు అందినట్టు సదరు మీడియా కథనం వెల్లడించింది. తపించుకొనేందుకు దారిని వెతుకుతున్నారని.. KWAN ఎన్.సిబి స్కానర్ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇతర టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలు పానిక్ బటన్‌ను తాకినట్లు ఒణికిపోతున్నాయని సదరు మీడియా వెల్లడించింది.
ఇక ఈ కేసులో మాజీ టాప్ పోలీసుల సహాయం కోరుతూ రెండు పెద్ద పేర్లు కూడా బయటపడ్డాయట. ఒక ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ కు డయల్ చేసి బాలీవుడ్ లో రెండు పెద్ద పేర్లను చెప్పి వారికి కవచం ఏర్పాటు చేయడంలో సహాయం కోరినట్లు తెలిసింది. ఒక నటుడు కం చిత్రనిర్మాత ఇందులో ఉన్నారు. ఈ ఏజెన్సీ 2019 డ్రగ్ పార్టీ వీడియోలో కనిపించిన ఒక నటుడిని సూచిస్తుంది. కేంద్ర ఔషధ(డ్రగ్) వ్యతిరేక ఏజెన్సీ (ఎన్.సి.బి) నుండి సదరు స్టార్ ని రక్షించడానికి లాయర్ల సహాయం కోరారట.
ఈ కేసులో `కింగ్ పిన్`'గా అవతరించిన టాలెంట్ మేనేజర్ జయ సాహాను ఎన్.సిబి విచారిస్తోంది. ఆమెను ఎన్‌సిబి అరెస్టు చేస్తే సదరు స్టార్ వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలీవుడ్-డ్రగ్ డొంకపై దర్యాప్తు చేస్తున్న ఎన్.సిబి అవసరమైతే దీపికను పిలిచే వీలుందని ఇదివరకూ ప్రచారమైంది. ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాను మంగళవారం నాడు ఎన్.సి.బి వాళ్లు ప్రశ్నించారు. ఎన్‌సిబి పలువురు వారసత్వ కథానాయికల్ని కూడా పిలవనుందని కథనాలొస్తున్నాయి.
కేంద్ర మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ ఇప్పటికే కరిష్మా ప్రకాష్... కెవాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సిఇఓ ధ్రువ్ చిట్గోపేకర్లను పిలిపించింది. కానీ కరిష్మా అనారోగ్యం కారణంగా మంగళవారం ఏజెన్సీ ముందు హాజరు కాలేదు. రాజ్ పుత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంపై ఎన్.సిబి దర్యాప్తులో బాలీవుడ్ లో విస్తృతమైన డ్రగ్స్ నెక్సస్ బయటపడింది. జయ సాహాతో వాట్సాప్ గ్రూపులో భాగమైన నటి `డి` (తరువాత దీపికా పదుకొనే అని నిర్ధారించబడింది) .. `కె` ల వాట్సాప్ చాట్ లను యాక్సెస్ చేసింది. డ్రగ్స్ ను సమన్వయం చేయడానికి వీరిని ఉపయోగించుకుంటారట. జయ సాహా `ఎస్` మరియు `ఎన్` లకు డ్రగ్స్ అందించడం గురించి చర్చిస్తున్నారు. అందులో `ఎస్` శ్రద్ధా కపూర్ అని ఇప్పటికే జాతీయ మీడియాలో ప్రచారమైంది.