Begin typing your search above and press return to search.
లగ్జరీ కార్లతో ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ సెలబ్రిటీలు
By: Tupaki Desk | 28 Aug 2021 5:51 AM GMTదేశంలో ఎంతగా సంపదలు ఉన్నా... లగ్జరీతో విలాసవంతమైన లైఫ్ స్టైల్ ని ఆస్వాధించగలిది కొందరే. ఈ తరహా జీవన విధానంలో ఎవరి ప్రత్యేకత వారిది. చాలా అరుదుగా విజయ్ మాల్యా .. నీరవ్ మోదీలా ఆస్వాధనలో ఉండేవాళ్లు లేకపోలేదు. కొందరు ఖరీదైన భవనాలు.. భవంతుల్లో రిచ్ నెస్ చూపిస్తే.. మరికొందరు ఖరీదైన కార్లు కొనేందుకు ఆసక్తిగా ఉంటారు. నవతరం ట్రెండ్ ఖరీదైన కార్లంటే పడి చచ్చే తరహా.. నేటితరం తమ లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని హుందాతనాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో కొంత మంది సెలబ్రిటీలు వాడుతున్న కార్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కోట్లాది రూపాయలు కార్ల కోసం వెచ్చిస్తున్నారు. రేర్ గా కొంతమంది సెలబ్రిటీలు.. ఇతర ప్రముఖులు మాత్రమే ఈ తరహా ఖరీదైన కార్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే `లంబోర్గిణి ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్` మోడల్ కారుని కొనుగోలు చేసారు. ఈ మోడల్ కారును ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి కొన్న రెండో స్టార్ తారక్ కావడం విశేషం. దీని ధర రూ.3.15 కోట్ల నుంచి రూ.4 కోట్ల మధ్యలో ఉంటుందిట. చాలాకాలం క్రితం బుక్ చేసిన ఈ కార్ కి ఉన్న డిమాండ్ కారణంగా ఇటీవలే తారక్ ఇంటికి వచ్చింది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కి కార్లంటే విపరీతమైన పిచ్చి. అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటైన `బుగాటీ వేరన్` కార్ ని కొన్నారు. దీని విలువ 12 కోట్లు. దీని వేగం గంటకు 400 కిలోమీటర్లు. ఇదే కారును మాజీ పుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానా రొనాల్డ్..రాబర్టో కార్లో వంటి సెలబ్రిటీలు వాడుతున్నారు.
మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏకంగా బాంబు ప్రూప్ కారునే వాడుతున్నారు. దీనిపేరు `మెర్సిడెజ్ బెంజ్ 600`. `సత్యమేవ జయతే` రియాల్టీ షో చేస్తోన్న సమయంలో అమీర్ కి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఈ కారు కొనుగోలు చేసారు. దీని ధర కోట్లలో ఉంటుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి కార్లంటే మోజే. ఆయన దగ్గర `రోల్స్ రాయ్స్ ఫాంటమ్ -7 `మోడల్ ఒకటుంది. నిర్మాత విధు వినోద్ చోప్రా బిగ్ బీకి గిప్ట్ గా ఇచ్చారు. అమితాబ్ కొన్న కార్లు అన్నింటికంటే ఖరీదైనది. హృతిక్ రోషన్ కూడా కార్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటారు. మార్కెట్ లోకి ఖరీదైన కొత్త మోడల్ దిగిందంటే దాని సంగతి చూడాల్సిందే . `రోల్స్ రాయ్స్ ఘోస్ట్ సిరీస్ -2` కారుంది. దాని ధర 7 కోట్లు పైనే. ఆ కారు కొని హృతిక్ తనకు నచ్చిన విధంగా మళ్లీ డిజైన్ లో మార్పులు చేయించారు. దానికి అదనంగా ఖర్చు నాలుగు కోట్లు అయ్యిందట.
ఇంకా పలువురు బడా వ్యాపార వేత్తలు ఖరీదైన కార్లను వినియోగిస్తున్నారు. అమెరికాలో భారతీయ వ్యాపార వేత్త మయూర్ షా. వరల్డ్ లో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన `చిరాన్` ని సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర 21 కోట్లు. తండ్రికి గిప్ట్ గా ఇవ్వడం కోసం చిరాన్ ని కొనుగోలు చేసారు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త అభిని సోహన్ రాయ్ `రోల్స్ రాయ్స్ `ఖరీదైన కారును భార్యకు బహుమతిగా ఇవ్వడం కోసం కొన్నారు. లండన్ లో ఉన్న భారతీయ వ్యాపార వేత్త రూబెన్ సింగ్ ఒకేసారి ఏకంగా ఆరు ఖరీదైన కార్లు కొన్ని వార్తల్లో నిలిచారు. అన్ని రోల్స్ రాయ్స్ కార్లే. వీటి మొత్తం విలువ 50 కోట్లు పైనేనట.
రోల్స్ రాయ్స్ తో పాటు.. `బుగాటీ వేరాన్`..` షోర్స్ 918 స్పైడర్`..` పగానీ హయారా`..` లంబోర్గిణి మురాకన్`..` ఫెరారా ఎఫ్-12` బెర్లీనట్లా సహా చాలాకార్లు ఉన్నాయి. ఇక భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం దగ్గర 170కి పైగానే కార్లు ఉన్నాయి. వీటిలో ఖరీదైనది `రోల్స్ రాయ్స్ ఫాంటమ్ సిరీస్ -8`. దీని ధర 13 కోట్లు పైనే. ఇలా సంపన్నులంతా తమ రిచ్ నెస్ ని భేషుగ్గా బయటపెడుతున్నారు.