Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో హ్యాండ్ ఇవ్వడంలో స్పెషలిస్టు!

By:  Tupaki Desk   |   23 Feb 2020 5:32 AM GMT
ఆ స్టార్ హీరో హ్యాండ్ ఇవ్వడంలో స్పెషలిస్టు!
X
ఆయనో పెద్ద స్టార్ హీరో. సాధారణ హీరోల కోసమే డైరెక్టర్లు ఎంతో సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఇక ఈ రేంజ్ స్టార్ కోసం సంవత్సరాల తరబడి డైరెక్టర్లు వేచి చూడడం అతి సాధారణంగా మారిపోయింది. అయితే అంత వెయిట్ చేసిన తర్వాత ఈ హీరో సినిమా ఇస్తే ఫర్వాలేదు కానీ హ్యాండ్ ఇస్తున్నాడట! దీంతో డైరెక్టర్ల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారుతోందని సమాచారం.

ఈ స్టార్ హీరో ఓ ఏడాదిన్నర క్రితం ఒక బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన డైరెక్టర్ తో సినిమా చేయాల్సి ఉంది. ప్రకటన కూడా వచ్చింది. అయితే హీరోగారికి లైన్ నచ్చింది కానీ కథ నచ్చలేదు. ఆ డైరెక్టర్ కథలను పకోడీలా ఒక క్షణంలో నూనెలోనుంచి తీసి ప్లేట్ లో పెట్టే టైపు కాదు. ఒక కథకు ఏడాది తీసుకుంటాడు. అంత కష్టపడ్డ తర్వాత హీరో గారు హ్యాండ్ ఇవ్వడంతో అప్సెట్ అయ్యి వేరే హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ఇద్దరి మధ్య రిలేషన్ చెడిందని కూడా టాక్ ఉంది.

సేమ్ స్టార్ హీరో మరో దర్శకుడితో ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా హిట్ అనిపించుకుంది. అతనితో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఆ దర్శకుడు కథను వండే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఈ సినిమానే పట్టాలెక్కాలి. కానీ స్టార్ హీరో గారికి స్టోరీలైన్ నచ్చిందట కానీ మొత్తం కథ నచ్చలేదట. దీంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి మరో దర్శకుడిని తన నెక్స్ట్ సినిమాకు ఎంచుకునే ఆలోచనలో ఉన్నాడట. ఈ దర్శకుడు ఆల్రెడీ ఈ స్టార్ హీరో ప్రాజెక్టు కోసం రెండేళ్ళు వేచి చూసి.. సెట్ కాకపోవడంతో వేరే మీడియం రేంజ్ సినిమా సెట్ చేసుకున్న వ్యక్తి. మరి ఇతని కథ అయినా ఒప్పుకుంటాడా లేదా ఇతనికి కూడా హ్యాండ్ ఇస్తాడా అని ఇండస్ట్రీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.