Begin typing your search above and press return to search.

మోరల్స్, లాజిక్స్, ఫ్యాక్ట్స్, ఫ్యాంటసీస్

By:  Tupaki Desk   |   19 April 2016 5:30 PM GMT
మోరల్స్, లాజిక్స్, ఫ్యాక్ట్స్, ఫ్యాంటసీస్
X
బహుశా టాలీవుడ్ ప్రేక్షకులకు దొరికన వరం కావచ్చు.. ఎందుకంటే మాస్ సినిమాలు - ఎంటర్టైన్ మెంట్ సినిమాలు తీయడానికి ఎక్కువ ఆస్కారం - ఎక్కువ అవకాశం - అవసరం వుందని భావిస్తున్న ఈరోజుల్లో పైన చెప్పిన మోరల్స్ - లాజిక్స్ - ఫ్యాక్ట్స్ - ఫ్యాంటసీస్ ని పెద్ద హీరోల దగ్గరనుండి ఆశించడం గగనమైపోయింది.

కానీ ముందేచెప్పుకున్నట్టు టాలీవుడ్ చేసుకున్న పుణ్యమో, ఈ జెనరేషన్ చేసుకున్న అదృష్టమో ఈ నాలుగు వ్యవహారాలకి తెలుగులో నాలుగు స్తంబాల్లాంటి దర్శకులు దొరికారు. మొదటిగా మోరల్స్ గురించి మాట్లాడుకుంటే వెంటనే త్రివిక్రమ్ గుర్తుకొస్తాడు. పదునైన సంభాషణలతో చిన్న గాయం కూడా కలగకుండా సరాసరి గుండెల్లో గుచ్చడం ఆయన స్పెషాలిటీ.

లాజిక్స్ విషయానికొస్తే మర్చిపోదామనుకున్నా గుర్తుండిపోయే పేరు సుకుమార్ ది. ప్రతీసన్నివేశం అలా ఎందుకు జరుగుతుందా అన్నదానికి అతనిదగ్గర ఒక రీజన్ వుంటుంది. అర్ధమైతే కనెక్ట్ అవుతాం. లేదంటే అర్ధంచేసుకోవడానికి ట్రై చేస్తాం.

తెలుగు సినిమాలలో పూరి జగన్నాధ్ హీరోలు మాట్లడినన్ని ఫ్యాక్ట్స్ మరే హీరో మాట్లాడివుండడు. బయట సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనలోని తత్వవేత్తని నిద్రలేపుతూ రాసే ప్రతీ డైలాగ్ సూపర్ హిట్టే.

తన కలని వెండితెరపై ప్రతిబింబించడం అద్భుతమైన కళ. ఫ్యాంటసీ ఓరియెంటెడ్ చిత్రాలు ఫెంటాస్టిక్ అనిపించుకోవడంలో రాజమౌళి తరువాతే ఎవరైనా.. ఆయన తీసిన సినిమాలు చూస్తున్నంత సేపూ మనం వేరే ప్రపంచంలో బ్రతకడం సర్వసాధారణం.

ఇలాంటి దర్శకులను అందించిన తెలుగు ఇండస్ట్రీకి ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు.