Begin typing your search above and press return to search.
2018లో బ్లాక్ బస్టర్స్.. 2019లో సినిమాలే లేవు
By: Tupaki Desk | 29 Jan 2019 1:30 AM GMT2018 ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితాలో నిలిచిన చిత్రాలు 'రంగస్థలం', 'భరత్ అనే నను'. ఈ రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను దక్కించుకున్నాయి. గత సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ఈ రెండు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లుగా వసూళ్లను రాబట్టాయి. ఆ రెండు సినిమాలతో సుకుమార్ మరియు కొరటాల శివలు మరోసారి తమ సత్తాను చాటారు. వీరిద్దరి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఆ సినిమాలు విడుదలై సంవత్సరం కావస్తున్నా ఇంకా కూడా వీరిద్దరు కూడా సినిమాలు మొదలు పెట్టలేదు. ఈ ఏడాదిలో వీరి సినిమాలు రావని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.
'రంగస్థలం' చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్న సుకుమార్ ఆ వెంటనే మహేష్ బాబుతో సినిమాను ప్రకటించాడు. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న 25వ చిత్రం 'మహర్షి'తో పాటు సుకుమార్ సినిమాను కూడా సమాంతరంగా చేద్దామని చెప్పాడు. కాని సుకుమార్ మొదట తీసుకు వచ్చిన కథ నచ్చక పోవడంతో మరో కథను సిద్దం చేసేప్పటికి ఈ సమయం పట్టిందని, ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా ఉండటం వల్ల మరో రెండు నెలల వరకు సుకుమార్ మూవీని మొదలు పెట్టే పరిస్థితి లేదని సమాచారం అందుతోంది.
మరో వైపు కొరటాల శివ పరిస్థితి కూడా ఇదే. భరత్ అనే నేను చిత్రం తర్వాత పలువురు హీరోలతో కొరటాల మూవీ అంటూ వార్తలు వచ్చాయి. అయితే కొరటాల తదుపరి చిత్రం చిరంజీవితో ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. గత సంవత్సరంలోనే సినిమాను ప్రారంభించాలని కొరటాల శివ కోరుకున్నాడు. కాని చిరంజీవి 151వ చిత్రంగా సైరా నరసింహారెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఆ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నాడు. ఈ సమయంలో రెండు సినిమాలు ఒకే సారి అంటే చిరంజీవి మరింతగా కష్టపడాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో రెండు సినిమాలకు నిర్మాత అయిన చరణ్ ఒప్పించి, మెప్పించి కొరటాలను వెయిటింగ్ లో పెట్టాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మార్చి లేదా ఏప్రిల్ లో చిరంజీవి, కొరటాలల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.
గత ఏడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకుని ఇండస్ట్రీ హిట్స్ దక్కించుకున్న దర్శకులు ఇలా సంవత్సరాలకు సంవత్సరాలు వృదా చేయడంతో వారి అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరు కోరుకుంటే వెంటనే డేట్లు ఇచ్చే హీరోలు చాలా మంది ఉన్నారు. కాని కొరటాలకు చిరంజీవితో చేయాలని, సుకుమార్ కు మహేష్ తో చేయాలని కోరికగా ఉంది. దాంతో ఇద్దరు కూడా చాలా విలువైన తమ డేట్స్ ను వృదా చేస్తున్నారు. సమయం వృదా అయినా వారితో మంచి సినిమాలు తీస్తామనే నమ్మకంగా ఈ హీరోలు ఉన్నారు.