Begin typing your search above and press return to search.

యంగ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో టాప్ హీరోయిన్ పెళ్లి?

By:  Tupaki Desk   |   13 Feb 2021 10:30 AM GMT
యంగ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో టాప్ హీరోయిన్ పెళ్లి?
X
స‌ద‌రు యువ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సౌత్ లో పెద్ద సెన్సేష‌నల్ ట్యాలెంట్. అత‌డికి గాళ్స్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. చిన్న వ‌య‌సులోనే ప్ర‌తిభావంతుడైన సంగీత ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నాలెన్నో సృష్టించాడు. కోలీవుడ్ టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల‌కు సంగీతం అందించాడు.

అలాగే ప‌లువురు సింగ‌ర్లు.. క‌థానాయిక‌ల‌తోనూ ఎఫైర్లు సాగించాడు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న కొంద‌రు భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది. అయితే అదంతా గ‌తం. ఇప్పుడు నేము ఫేము ఉన్న మ‌రో ప్ర‌ముఖ హీరోయిన్ తో అత‌డు ఎఫైర్ సాగిస్తున్నాడ‌న్న‌దే హాట్ టాపిక్ గా మారింది.

ద‌క్షిణాదిలోనే టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఉన్న ఆ కుర్రాడిని పెళ్లాడేందుకు స‌ద‌రు హీరోయిన్ ఎంతో ఆస‌క్తిగా ఉంద‌ట‌. ఈ ఏడాది చివ‌రిలోనే ఈ జంట పెళ్లి జ‌రుగుతుంద‌ని దానికి ముహూర్తాలు పెట్టేయ‌బోతున్నార‌ని ప్ర‌చార‌మైపోతోంది. అయితే దీనిపై ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కానీ.. స‌ద‌రు హీరోయిన్ కానీ స్పందించ‌లేదింకా. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రి పేర్ల‌తో లింక‌ప్ వార్త‌లు ఇంట‌ర్నెట్ ని హీటెక్కించేస్తున్నాయ్.