Begin typing your search above and press return to search.

ఆరుగురు హీరోయిన్లు.. అలా అనేశారు

By:  Tupaki Desk   |   2 Oct 2016 10:30 PM GMT
ఆరుగురు హీరోయిన్లు.. అలా అనేశారు
X
టాలీవుడ్ కి బోలెడంత ఘనకీర్తి ఉంది. అంతటి విస్తృతమైన పరిధి లేకపోయినా.. బాలీవుడ్ తర్వాత అంతటి మార్కెట్ టాలీవుడ్. సల్మాన్.. అమీర్ లాంటి టాప్ హీరోలు దేశవ్యాప్తంగా వసూలు చేసే తొలి రోజు వసూళ్లను మొత్తాన్ని.. మన స్టార్లు కేవలం తెలుగు రాష్ట్ట్రాల నుంచే సాధించేయగలరంటే.. టాలీవుడ్ రేంజ్ అర్ధమవుతుంది. కానీ హీరోయిన్ల విషయంలో మనకున్నంత బ్యాడ్ నేమ్ మరే ఇండస్ట్రీకి లేదు. ఆఖరికి సెమీ పోర్న్ సినిమాలు తీసే భాషల్లో హీరోయిన్స్ కి కూడా ఓపెన్ గా ఇండస్ట్రీని విమర్శించరు.

తాప్సీ పన్ను: పింక్ తో ఓ రేంజ్ కి చేరుకున్న తాప్సీ.. టాలీవుడ్ ద్వారానే హీరోయిన్ అయింది. అయితే.. ఇక్కడున్నన్నాళ్లూ ఈమెకు చుక్కలు చూపించేశారని చెప్పింది. టైమ్ కి డబ్బులు ఇవ్వకపోవడం, ఇష్టం వచ్చినట్లు షూటింగ్ క్యాన్సిల్ చేయడం లాంటివి చాలానే జరిగాయి. ప్రస్తుతం చేస్తున్న బైలింగ్యువల్ ఘాజీ తప్ప.. మరో తెలుగు సినిమా అంగీకరించేందుకు ఈమె సిద్ధంగా లేదని అంటున్నారు.

రాధికా ఆప్టే: తెలుగు హీరోలు ఫుల్లు ఇన్ సెక్యూర్ అని.. అందుకే తమ ట్యాలెంట్ ప్రకారం యాక్టింగ్ చేసే అవకాశం కూడా ఉండడం లేదని.. రాధికా ఆప్టే ఓపెన్ గానే రెండు సార్లు చెప్పేసింది.

సమంత : ఈ ఏడాది ఇప్పటికి వరసగా నాలుగు హిట్స్ కొట్టిన సమంత.. తన ట్యాలెంట్ కి తగ్గ రోల్స్ ఎవరూ ఆఫర్ చేయకపోవడంతోనే.. కొత్త సినిమాలు సైన్ చేయడం లేదని చెప్పింది.

జెనీలియా డిసౌజా: పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకుని.. రీ ఎంట్రీ కోసం రెడీ అయిన ఈ భామ.. టాలీవుడ్ లో చాలామందికి పెద్ద పార్టీ ఇచ్చింది. అయితే.. ఈమెకు పెళ్లయిన భామ అనే కారణంతో సినిమా ఎవరూ ఆఫర్ చేయలేదనే విషయాన్ని గమనించాలి.

చార్మీ కౌర్ : ఓ సినిమా మీద కాకపోయినా.. కనీసం ఓ సీన్ గురించి అయినా.. హీరోయిన్స్ చెప్పే సజెషన్స్ ని డైరెక్టర్లు స్వీకరించరు సరికదా విమర్శిస్తారని.. చార్మీ కౌర్ వాపోయింది.

ప్రియమణి : సౌత్ లోని నాలుగు భాషల్లోనూ నటించిన ప్రియమణి.. తెలుగులో తనకు ఆఫర్స్ అంతగా రాకపోవడంపై అసహనం చూపేది. ఒక్క రాజమౌళి మినహాయిస్తే.. నటనకు అవకాశం ఉండే రోల్ తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని ఓసారి చెప్పింది ప్రియమణి.

వీరి గోడంతా వింటుంటే.. మనోళ్లు హీరోయిన్లకు ఎంత వాల్యూ ఇస్తారో అర్ధం కావడం లేదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/