Begin typing your search above and press return to search.
టిక్ టాక్ లో రెహమానియా!
By: Tupaki Desk | 20 Feb 2020 7:45 AM GMTసోషల్ మీడియాల్లో టిక్ టాక్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇండియాలో ఓ రేంజ్ లో వినియోగంలో ఉన్న యాప్ ఇది. అప్ కమ్ ఆర్టిస్టులకు టిక్ టాక్ ఒక మంచి వేదికగా సాయమవుతోంది. కథానాయికలు .. ఇంకా చిన్న స్థాయి నటీనటులకు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే వేదికగా మారింది. స్టార్ హీరోలు.. స్టార్ ప్రొడ్యూసర్లు (అరవింద్) కూడా టిక్ టాక్ కి మినహాయింపు కానే కాదు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ కూడా టిక్ టాక్ పై ఆసక్తి గా ఉన్నారని ప్రచారం సాగింది. అంతకుముందే... చాలా మంది హీరోలు..హీరోయిన్లు టిక్ టాక్ లో చేరి రచ్చ చేసారు.
తాజాగా స్వరమాంత్రికుడు..ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ కూడా టిక్ టాక్ లో తన సినిమాను ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా.. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో 99 సాంగ్స్ అనే సినిమాని హిందీలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మ్యూజికల్ రొమాంటిక్ నేపథ్యం లో సాగే ఈ చిత్రానికి రెహమానే స్వరకర్త. ఈ సినిమాలో కొన్ని పాటలకు స్వయంగా రెహమాన్ కలం పట్టి లిరిసిస్టుగా మారారు. సొంత నిర్మాణ సంస్థలో సినిమా కావడంతో రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజీకి రాకుండా నిర్మిస్తున్నారు.
అందుకే రెహమాన్ వీలైనంతగా ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకెళ్లాలని భావించి ఇప్పుడు టిక్ టాక్ లో సినిమాను ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. అస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ టిక్ టాక్ లోకి ఎంటర్ అవ్వడంతో కోలీవుడ్ సహా టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రంలో ఇహాన్ భట్..ఎడిల్సీ వర్గీస్ హీరో- హీరోయిన్ల గా నటిస్తున్నారు. ఈ ఏడాది సినిమా విడుదల కానుంది.