Begin typing your search above and press return to search.
మహేష్ ను దిల్ రాజు వదలడం లేదుగా!
By: Tupaki Desk | 14 Feb 2019 12:45 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' తర్వాత చేయబోయే సినిమాకు దర్శకుడు ఎవరు? ఈ ప్రశ్నకు ఓ నాలుగు రోజుల ముందు వరకూ జవాబు 'సుకుమార్' అని ఎవరైనా తడుముకోకుండా చెప్పేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. #మహేష్ 26 సినిమాకు దర్శకుడిగా అనిల్ రావిపూడి లైన్లోకొచ్చాడని.. సుక్కుతో #మహేష్ 27 ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇది జస్ట్ ప్రచారం కాదని.. ఈ దిశగా ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. సుకుమార్ స్క్రిప్ట్ ను వండాలంటే 2-మినిట్ మ్యాగీ నూడుల్స్ టైపు వ్యవహారం కాదు. మాంచి పచ్చి మామిడి కాయలతో అవకాయ పెట్టే టైపు. అది అంత త్వరగా తెమలదు. అందుకే మహేష్ కూడా సుక్కును అర్థం చేసుకొని ఫుల్ గా టైమ్ ఇచ్చాడట. ఇక అనిల్ రావిపూడి కి కథ రెడీ చేసేందుకు.. ఫుల్ స్క్రిప్ట్ గా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకునే రకం కాదు. పట్టాలెక్కిన తర్వాత కూడా సినిమా చకచకా నాలుగైదు నెలల్లో లాగించేస్తాడు. అందుకే మహేష్ అనిల్ కు వోటేశాడని అంటున్నారు.
ఈ సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు ఇప్పటికే ముందుకొచ్చారట. మహేష్ 'మహర్షి' నిర్మాతల్లో రాజుగారు ఒకరన్న సంగతి తెలిసిందే. మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాలను వరసగా నిర్మిస్తున్నారు. తన బ్యానర్ కు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందించిన అనిల్ రావిపూడి నెక్స్ సినిమాను అయన వదులుకునేందుకు అయన సిద్దంగా లేరట. అసలు మహేష్ - అనిల్ రావిపూడి ప్రాజెక్టు ప్రపోజల్ వెనక ఆయనే ఉన్నారట. ఈ సినిమా దాదాపు ఫైనల్ అయినట్టేనట.
కాకపోతే ఈ చిత్రానికి దిల్ రాజు సోలో ప్రొడ్యూసర్ కాదని సమాచారం. దిల్ రాజు తో పాటుగా అనిల్ సుంకర ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తారట. అనిల్ సుంకర తన స్నేహితులతో కలిసి మహేష్ తో 'దూకుడు' లాంటి సూపర్ హిట్ ను నిర్మించారు. కానీ ఆ తర్వాత '1 నేనొక్కడినే'.. 'ఆగడు' సినిమాల వల్ల తీవ్ర నష్టాలు వచ్చాయి. అప్పటి నుంచి అనిల్ సుంకర కోసం మహేష్ ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ లో ఆయన్ను భాగస్వామిగా చేర్చాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన రానుందట.