Begin typing your search above and press return to search.
దసరాకి పాన్ ఇండియా సినిమాలన్నీ లాంచ్ కి రెడీ!
By: Tupaki Desk | 7 Sep 2021 10:30 AM GMTప్రస్తుత క్రైసిస్ లో పాన్ ఇండియా అనే మాటే ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికిప్పుడు పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నా రిలీజ్ ఎలా చేయాలి? అన్న సందిగ్ధత అలానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పాక్షికంగా మాత్రమే తెరుచుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇప్పటికీ థియేటర్లను తెరవలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్టు ధరలు పాన్ ఇండియా సినిమాల నిర్మాతలను బెంబేలెత్తిస్తున్నాయి. అగ్ర హీరోలతో భారీ సినిమాలు తీయాలంటే ఇప్పుడు ఇబ్బందులెన్నో ఉన్నాయి. ఈ చిక్కుముడులేవీ ఇప్పట్లో వీడేట్టు లేవు.
కానీ ఇంత క్రైసిస్ లోనూ టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల లాంచ్ లకు ముహూర్తాలు ఫిక్స్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. వందల కోట్ల బడ్జెట్లతో రూపొందే ఈ సినిమాల రిస్క్ ఫ్యాక్టర్ గురించి అతడు ఎంతమాత్రం భయపడుతున్నట్టు లేదన్న చర్చా వేడెక్కిస్తోంది. ఇంతకీ ఎవరాయన? అంటే.. పరిశ్రమ అగ్రజుడు దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
సెప్టెంబర్ - అక్టోబర్ దిల్ రాజుకు ఎంతో కీలకంగా మారుతున్నాయి. వరుసగా పాన్ ఇండియా సినిమాల లాంచ్ కి ముహూర్తాలు ఫిక్సయ్యాయి. దిల్ రాజు ఒకదాని వెంట ఒకటిగా మూడు పాన్ ఇండియన్ సినిమాలను ప్రారంభించబోతున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే నిర్మాత దిల్ రాజు ఇవన్నీ ప్రారంభిస్తారు.
ఈ మూడు ప్రాజెక్టుల్లో తొలిగా రామ్ చరణ్ ఆర్.సి 15 సెట్స్ పైకి వెళుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 8న ప్రారంభమవుతోంది. ఇప్పటికే దిల్ రాజు భారీ లాంచ్ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేసారని తెలిసింది. ఈ ఈవెంట్లో చరణ్-శంకర్ లతో పాటు చిరంజీవి.. రణ్ వీర్ సింగ్ .. కియరా అద్వాణీ కూడా పాల్గొంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాని లాంచ్ చేసేందుకు దిల్ రాజు సన్నాహకాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసినదే. దసరా పండుగ సందర్భంగా అధికారిక ప్రకటన లేదా లాంఛనంగా ప్రారంభించడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఐకన్ చిత్రాన్ని దసరా సమయంలోనే ప్రారంభించేందుకు ఆస్కారం ఉందని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఐకన్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కి ఇతర అన్ని దక్షిణాది భారత భాషలలోకి అనువాదమవుతుందని సమాచారం. బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా చిత్రాలను ప్రారంభించేందుకు అవిశ్రామంగా దిల్ రాజు బృందం శ్రమిస్తున్నారని తెలిసింది. ఇవన్నీ 2022-23 సీజన్ లో రిలీజ్ చేసేందుకు పకడ్భందీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిసింది. ఓవైపు కరోనా క్రైసిస్ భయాలు నెలకొన్నా అవేవీ అగ్ర నిర్మాత దిల్ రాజును భయపెట్టడం లేదు. పక్కా క్యాలిక్యులేటెడ్ గా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారు. చరిత్రలో ఒకడుండేవాడు అని చెప్పుకునేలా..! ఆయన ఇలా క్రేజీ కాంబినేషన్లతో సినిమాలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఆయన డ్యాషింగ్ యాటిట్యూడ్ ని కూడా ఎలివేట్ చేస్తోందని చెప్పొచ్చు.