Begin typing your search above and press return to search.
షాక్: పారితోషికం తిరిగిచ్చేస్తానన్న నారప్ప!
By: Tupaki Desk | 8 July 2021 10:30 AM GMTవిక్టరీ వెకంటేష్ కథానాయకుడిగా తెరకెక్కిన `నారప్ప` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. పాండమిక్ కారణంగా థియేట్రికల్ రిలీజ్ కష్టమని భావించిన సురేష్ బాబు ఓటీటీ వైపే మొగ్గు చూపారు. అయితే ఓటీటీ రిలీజ్ కు ఎగ్జిబిటర్లు ఒప్పుకోలేదు. అగ్ర హీరోల సినిమాలు నేరుగా థియేటర్ లోనే రిలీజ్ అవ్వాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు..ఎగ్జిబిటర్ల మధ్య సమావేశాలు కూడా జరిగాయి. తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు మీడియా సమావేశంలోనే అగ్రనిర్మాతను నిలదీశారు. కాగా ఇప్పుడిప్పుడే కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితులు కూడా అదుపులోకి వస్తున్నాయి. పాజిటివ్ కేసులు సంఖ్య బాగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు రీ ఓపెన్ కు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల కోరిక మేరకు సురేష్ బాబు థియేటర్లో రిలీజ్ కు ఒప్పుకున్నారు.
అమ్మకం జరిపిన ఓటీటీ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురేష్ బాబు క్లియరెన్స్ కూడా తెచ్చుకున్నారు. అయితే చిత్ర సమర్పకుడు థాను మాత్రం థియేట్రికల్ రిలీజ్ కు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థతుల్లో ఓటీటీ బెస్ట్ అని సురేష్ బాబు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారుట. దీంతో రంగంలోకి నారప్ప కథానాయకుడు వెంకటేష్ దిగి సర్ధి చెబుతున్నారని సమాచారం.
సమర్పకుడు థాను ని ఒప్పించేందుకు వెంకటేష్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. థియేట్రికల్ రిలీజ్ వల్ల నష్టం జరిగితే తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తానని తాను ఒప్పందం చేసుకున్నట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి నారప్ప ఈ రకంగా త్యాగం చేయక తప్పలేదు.