Begin typing your search above and press return to search.
టాప్ ప్రొడక్షన్ హౌస్ ఓటీటీ ఎంట్రీ
By: Tupaki Desk | 3 Dec 2021 3:30 AM GMTకరోనా కారణంగా ఇండియాలో ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అయిదు ఆరు ఏళ్ల తర్వాత ఓటీటీ మార్కెట్ ఈ రేంజ్ కు పెరుగుతుందని మార్కెట్ వర్గాల వారు అంచనా వేశారు. కాని కరోనా వల్ల థియేటర్లు మూత పడటం.. జనాలు ఎంటర్ టైన్ మెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయించడం.. సినిమాల నిర్మాతలు థియేటర్లు మూత పడటం వల్ల తమ సినిమాలను వదిలించుకునేందుకు ఓటీటీలను ఆశ్రయించడం చేశారు. దాంతో ఓటీటీ లకు ఇండియాలో ఆధరణ అమాంతం పెరిగింది. ప్రస్తుతం స్టార్ హీరోల నుండి చిన్న నటీ నటుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఓటీటీ కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ దర్శకులు కూడా ఓటీటీ కంటెంట్ ను క్రియేట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. భాష తో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా కూడా ఓటీటీ లు పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ లను మరియు వెబ్ మూవీస్ ను అందిస్తున్నాయి.
ఈ సమయంలో బాలీవుడ్ ప్రముఖులు పలువురు ఓటీటీ ఎంట్రీకి సిద్దం అయ్యారు. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకింగ్ సంస్థగా పేరు దక్కించుకున్న యశ్ రాజ్ సంస్థ వారు కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్దం అయ్యారు. యశ్ రాజ్ సంస్థలో ఎన్నో వందల సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఎన్నో ఎప్పటికి నిలిచి పోయే ఆణిముత్యాలు.. క్లాసిక్ మూవీస్ కూడా ఉన్నాయి. ఎంతో మంది హీరోలను స్టార్స్ గా సూపర్ స్టార్స్ గా చేసిన ఘనత ఈ సంస్థకు దక్కింది అనడంలో సందేహం లేదు. ఈ సంస్థ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. 'ది రైల్వే మ్యాన్' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
నేడు యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను ప్రకటించి.. సరిగ్గా వచ్చే ఏడాది ఇదే రోజున ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఏ ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతున్న విషయం ను క్లారిటీ ఇవ్వలేదు. 1984 లో జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజ్ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా టైటిల్ లోనే పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పద.. సున్నిత విషయాలను థియేట్రికల్ సినిమాల ద్వారా చూపించడం కాస్త ఇబ్బందికర విషయం. అందుకే ఈ సినిమా ను ఓటీటీ ద్వారా తీసుకు వస్తే ఎక్కువ మందికి చేరువ అవుతుందని అంటున్నారు. మాధవన్.. కయ్ కయ్ మీనన్.. దివ్యేందు.. ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ లు ఈ సినిమా లో కనిపించబోతున్నారు. శివ్ రావల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈవెబ్ మూవీని 2022 డిసెంబర్ 2న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.