Begin typing your search above and press return to search.

`ఏజెంట్` లుక్ వెన‌క దాగిన టాప్ సీక్రెట్ లీక్

By:  Tupaki Desk   |   7 Aug 2021 8:30 AM GMT
`ఏజెంట్` లుక్ వెన‌క దాగిన టాప్ సీక్రెట్ లీక్
X
అక్కినేని వార‌సుడు అఖిల్ కెరీర్ కోసం ఎంత‌గా శ్ర‌మిస్తున్నాడో చూస్తున్నాం. త‌న‌ని తాను మార్చుకోవ‌డానికి నిరంత‌రం శ్ర‌మిస్తున్నాడు. ఫెయిల్యూర్స్ ని ప‌క్క‌న‌బెట్టి స‌క్సెస్ అనే ధ్యేయంతో ప‌నిచేస్తున్నాడు. ప‌రాజయాలు చూసి అఖిల్ ఏమాత్రం నిరుత్సాహప‌డ‌లేదు. పెర్పామెన్స్ లో ది బెస్ట్ అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. న‌టుడిగా షైన్ అవుతూ త‌న‌లోని త‌ప్పుల్ని తెలుసుకుని ముందుకు క‌దులుతున్నాడు. లుక్ ప‌రంగాను అఖిల్ ఎంతో షైన్ అయ్యాడు. ఈ మార్పుల‌న్నీ ఏజెంట్ లో క‌నిపిస్తున్నాయి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ఏజెంట్` యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ కావ‌డంతో ఇందులో అఖిల్ లుక్ ని డిఫ‌రెంట్ గా ఎలివేట్ చేస్తున్నారు.

తాజాగా అఖిల్ న‌యా ట్రెండీ లుక్ ఎలా సాధ్య‌మైంది? అంటే.. అత‌డు ఎవ‌రిని స్ఫూర్తిగా తీసుకుని రూపాంత‌రం చెందాడో తెలుసుకుంటే ఆస‌క్తి క‌లుగుతోంది. వెండి తెర‌పై సూరి స‌రికొత్త అఖిల్ నే చూపించ‌బోతున్నాం.. తాజాగా అఖిల్ న్యూ లుక్ ఒక‌టిప్పుడు వైర‌ల్ గా మారింది. గుబురు గెడ్డం.. మీసక‌ట్టు..హెవీ హెయిర్ తో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ గేమ్ ఆఫ్ థ్రోన్ లో కీల‌క పాత్ర ధారి అయిన జాన్ స్నోని పోలి ఉంద‌ని నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. హెచ్ బీవో లో లైవ్ అవుతోన్న `గేమ్ ఆఫ్ థ్రోన్` సిరీస్ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. అందులో జాన్ స్నో పాత్ర‌కు... వేషాధార‌ణ‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. స‌రిగ్గా అదే లుక్ లో ఇప్పుడు అఖిల్ కనిపంచ‌డంతో అక్కినేని వార‌సుడ్ని ఆ సీనియ‌ర్ స్టార్ తో పోల్చేస్తున్నారు. లుక్ ప‌రంగా `ఏజెంట్` ముందే మార్కులు కొట్టేసాడు. కండ‌లు మెలితిరిగిన దేహంతో అఖిల్ భీక‌రంగా క‌నిపిస్తున్నాడు. కాబ‌ట్టి ఏజెంట్ కి అప్పుడే పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిన‌ట్లే.

ప్ర‌స్తుతం ఏజెంట్ షూటింగ్ ద‌శ‌లో ఉంది. కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. అలాగే అఖిల్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. కానీ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలా? లేక థియేట‌ర్లో రిలీజ్ చేయాలా? అన్న దానిపై చ‌ర్చ సాగుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనిపై మ‌రింత‌ స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.