Begin typing your search above and press return to search.
టాప్ సీక్రెట్.. ఏప్రిల్ 17న పెళ్లాడటానికి కారణం..!
By: Tupaki Desk | 7 April 2022 5:30 AM GMTఆర్.ఆర్.ఆర్ చిత్రంతో సంచలన విజయం అందుకుని పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతోంది ఆలియాభట్. తన కెరీర్ బెస్ట్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ రికార్డులకెక్కింది. ఈ అవకాశానికి ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ బ్యూటీ ఇంతలోనే ప్రియుడు రణబీర్ ని పెళ్లాడేస్తూ అభిమానుల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింఇ.
అలియా భట్- రణబీర్ కపూర్ వివాహ వేడుకలు ఏప్రిల్ 4 న ప్రారంభం కానున్నాయి. ఈ జంట ఏప్రిల్ 17 న వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ వివాహానికి వేదిక ట్రెండింగ్ లో ఉంది. RK హౌస్ చెంబూర్ లో వివాహం చేసుకోబోతున్నారని కథనాలొస్తున్నాయి.
అక్కడ రణబీర్ తల్లిదండ్రులు నీతూ కపూర్ రిషి కపూర్ ను 1980లో వివాహం చేసుకున్నారు. అలాగే పెళ్లి తేదీగా 17 ని ఎంపిక చేసుకోవడం వెనక కారణం ఆసక్తిని కలిగిస్తోంది. కపూర్ కుటుంబానికి అదృష్ట సంఖ్య 7+1 = 8. 8వ సంఖ్యపై రణబీర్ కి మక్కువ ఎక్కువ అన్నది ప్రపంచానికి తెలుసు. ఆలియా భట్ కూడా అదే నమ్మకంతో ఏప్రిల్ 17కి సంతోషంగా అంగీకరించారు.
ఈ పెళ్లి కోసం కపూర్ ఇల్లు దుల్హన్ లాగా అలంకరించనున్నారట. ఇన్నాళ్లుగా కపూర్ కుటుంబానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రత్యేక విక్రేత ఏప్రిల్ 14న ఉత్సవాలు ప్రారంభమయ్యే ఒక రోజు ముందు కొత్త పెళ్లికూతురులా ఇంటిని అలంకరించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. కృష్ణ రాజ్ కపూర్ జ్ఞాపకార్థం అలియా-రణబీర్‌ల సింపుల్ గా సన్నిహిత వివాహానికి ప్లానింగ్ సాగుతోంది.
నిజానికి కపూర్ కుటుంబం విలాసవంతంగా అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని చేయాలని భావించింది. అయితే రణబీర్ కపూర్ అమ్మమ్మ కృష్ణ రాజ్ కపూర్ తన ఇంట్లో అలియాతో వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. వారు రాజ్ కపూర్ ఇంటిని వివాహం చేసుకోవడానికి ఇదే కారణమని కూడా తెలుస్తోంది.
ఇటీవలి ఓ ఇంటరాక్షన్ లో రణబీర్ కపూర్ త్వరలో వివాహం చేసుకునే అన్ని ఉద్దేశాలు ఉన్నాయని ధృవీకరించారు. అయితే ఇతర కారణం వల్ల అతను మీడియాకు పెళ్లి తేదీని వెల్లడించలేదు. అలాగే ఈ పెళ్లికి కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారు. ఇండస్ట్రీలో చాలామందికి ఆహ్వానం లేదు. కరణ్ జోహార్ -అయాన్ ముఖర్జీ మినహా బాలీవుడ్ పెద్దలెవరూ పెళ్లికి ఆహ్వానించబడలేదు.
రణ్‌బీర్ - అలియా సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంటారు కాబట్టి అలియా భట్ గాడ్ ఫాదర్ అయిన కరణ్ జోహార్ .. రణబీర్ కు అత్యంత సన్నిహితుడైన అయాన్ ముఖర్జీ మినహా పెద్దగా ఎవరూ ఆహ్వానించలేదు. అయితే షారూక్ - సల్మాన్ - అమీర్ ఖాన్ లాంటి ఖాన్ ల త్రయానికి ఆహ్వానం ఉండే వీలుంది. అయితే అధికారికంగా ఏదీ రివీల్ కాలేదు. ఇక ఈ జంట తమ బాలీవుడ్ స్నేహితులు - సోదరుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ను నిర్వహించనున్నారు.