Begin typing your search above and press return to search.
సీక్రెట్ గా పెళ్లిపీటలెక్కిన టాప్ సింగర్!
By: Tupaki Desk | 20 May 2021 9:30 AM GMTఅమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందో.. కొవిడ్ పరిస్థితులో తెలియదుగానీ ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది. కాలిఫోర్నియాలోని తన నివాసంలో అతి కొద్ది మంది బంధుమిత్రులతో పెళ్లి తంతు ముగించింది. ఆ తర్వాత.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో.. అందరూ అవాక్కైపోయారు.
వాస్తవానికి అరియానా గ్రాండే, తన ప్రియుడు డాల్టన్ గోమేజ్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోయే సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ గతంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. గత డిసెంబర్ లో ముగించిన ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. కానీ.. పెళ్లి మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా చేసుకున్నారు!
ఈ పెళ్లికి కేవలం 20 మందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక, వీరి వివాహానికి ముందే అమెరికాలో ఓ హై క్లాస్ బంగ్లాను కొనుగోలు చేశారు. ఇక, కొత్త జీవితాన్ని సంతోషంగా ఆ ఇంట్లో మొదలు పెట్టబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఏకంగా 253 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరి శుభాకాంక్షలు వెల్లువలో తడిసి ముద్దవుతోందీ కొత్త జంట.