Begin typing your search above and press return to search.
ఒకే వేదికపై చిరు-బాలయ్య-మహేష్-ఎన్టీఆర్
By: Tupaki Desk | 16 Nov 2017 4:08 AM GMTఏ వేడుకలో అయినా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపిస్తే దాని గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. అలాంటిది వేర్వేరు క్యాంపులకు చెందిన.. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లయినప్పటికీ విభేదాలతో ఉన్న హీరోలంతా కలిసి ఒక వేదిక మీదికి వస్తే అదెంత ఆసక్తి రేకెత్తిస్తుందో వేరే చెప్పేదేముంది? చివరగా ‘మేము సైతం’ కార్యక్రమంలో ఇలా స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించారు. త్వరలోనే మరోసారి స్టార్ హీరోల ఆసక్తికర కలయిక చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్లకు కలిపి ప్రకటించిన నంది అవార్డులకు సంబంధించి జనవరిలో పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనుంది.
ఈ వేడుకలో రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి.. 2014 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడానికి నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాతి రెండేళ్లకు ఉత్తమ నటులుగా పురస్కారాలు అందుకోవడానికి మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు. వీరిలో ఎవరూ ఈ వేడుకకు డుమ్మా కొట్టరనే భావిస్తున్నారు. మరి వీళ్లందరినీ కలిసి ఒకే ఫ్రేమ్ లో చూస్తే అభిమానులకు అంతకంటే ఆనందమేముంది? వీళ్లందరి కలయిక కంటే కూడా బాబాయి బాలకృష్ణ.. అబ్బాయి ఎన్టీఆర్ కలిసి చాలా ఏళ్ల తర్వాత ఒకే వేడుకలో కనిపించడమూ ఆసక్తి రేకెత్తించేదే. కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ను దూరం పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో తారక్ కు తనే స్వయంగా అవార్డు ఇవ్వబోతుండటం కూడా ప్రత్యేకమైన విషయమే. ఈ వేడుకలో నందమూరి హరికృష్ణ.. కళ్యాణ్ రామ్.. నారా లోకేష్ కూడా పాల్గొనే అవకాశముంది కాబట్టి ఈ కలయిక ఉత్కంఠ రేకెత్తించేదే.