Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: ఖాన్ లు కూడా టచ్ చేయలేని రేంజులో..!
By: Tupaki Desk | 14 July 2021 4:30 AM GMTబ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వేడి పుట్టించినా.. ప్రతిదీ దేనికదే వైవిధ్యంగా ఉంటేనే ఆడియెన్ ఆదరిస్తారు. 90లలో తరహాలో స్టీరియో టైపిక్ కమర్షియల్ సినిమాల్ని ఆమోదించేందుకు నేటి జనరేషన్ ఆడియెన్ సిద్ధంగా లేరు. ప్రతిసారీ థియేటర్ కి వెళితే ఏం కొత్తదనం ఉంది? అన్నదే ఇప్పుడు కొలమానంగా మారింది.
ఒకసారి లవ్ స్టోరీలో నటిస్తే.. ఇంకోసారి ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ చేయాలి. ఆ తర్వాత భారీ మాస్ యాక్షన్ సినిమా చేయాలి. మరోసారి రామాయణం మహాభారతం లాంటి పురాణాలను టచ్ చేయాలి లేదా ఏదైనా పురాణేతిహాసం నుంచి గొప్ప కథను ఎంపిక చేయాలి. ఓసారి ఐ రోబో తరహాలో భారీ ప్రయోగం చేస్తే.. ఇంకోసారి మాఫియా కథల్ని ఎంచుకుని ఎవరికీ అందనంత కొత్తగా కనిపించాలి.
అయితే ఈ తరహాలో వైవిధ్యం పాటిస్తున్న నేటితరం హీరో ఎవరు? అంటే ఒక్క ప్రభాస్ మాత్రమే కనిపిస్తున్నాడు. బాహుబలి లాంటి చారిత్రాత్మక కథాంశాన్ని ఎంచుకున్న తర్వాత వెంటనే `సాహో` లాంటి భారీ మాస్ యాక్షన్ చిత్రంలో డాన్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత `రాధేశ్యామ్` లాంటి `లవ్ స్టోరి`ని ఎంచుకున్నాడు. ఈ మూడు సినిమాల మధ్య అస్సలు సారూప్యత అన్నదే లేదు. దేనికదే వైవిధ్యంతో ప్రత్యేకమైనవి.
ఆ వెంటనే `ఆదిపురుష్ 3డి` లాంటి మరో విలక్షణమైన సినిమా చేస్తున్నాడు. ఇది పురాణేతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమా. ఇందులో శ్రీరాముడిగా మెస్మరైజ్ చేసే నటనతో ప్రభాస్ కట్టిపడేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు సలార్ లాంటి భారీ మాఫియా యాక్షన్ సినిమాని ఎంపిక చేయడం అతడిలోని విలక్షణతకు అద్దం పట్టింది.
ఈ సినిమా తరవాత వీటన్నిటినీ మించిన భారీ ప్రయోగం చేయబోతున్నాడు. అదే నాగ్ అశ్విన్ తో కలిసి ఐ రోబో తరహాలో సూపర్ హీరో సినిమా చేయనున్నాడు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో లెవల్ లో ఉంటుందన్న చర్చా వేడెక్కిస్తోంది. ప్రభాస్ ని పాన్ వరల్డ్ హీరోగా పరిచయం చేస్తానని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించడం నిజంగానే సంచలనం అయ్యింది. ఈ మూవీ కోసం అతడు సుదీర్ఘ సమయం ప్రీప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం బ్యాక్ ఎండ్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమా తర్వాతా ప్రభాస్ వార్ దర్శకుడితో మరో వైవిధ్యమైన యాక్షన్ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారు.
ప్రభాస్ కి హిందీ బెల్ట్ లో ఇంత గొప్ప కనెక్టివిటీ పెరగడానికి అతడి ఆలోచనలు ఎంపికలే కారణం. సమకాలీన హీరోల్లో వేరొక హీరో ఎవరూ టచ్ చేయలేని రేంజులో అతడి ప్లానింగ్ సాగుతోంది. ఆదిపురుష్ 3డి అతడి తొలి హిందీ చిత్రం. ఇప్పుడు అతని రెండవ వరుస హిందీ చిత్రం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. # ప్రభాస్ 24 అతడు నటిస్తున్న రెండో స్ట్రెయిట్ హిందీ చిత్రంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని వైరల్ ఆ ప్రమోట్ చేస్తున్నారు. వార్ దర్శకుడితో మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మరో సంచలనం కాబోతోందన్న ప్రచారం హీటెక్కిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాతా అతడు యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో ధూమ్ 4లో నటిస్తే అది ఒక చరిత్ర అవుతుంది. ఆ తర్వాత అతడు జాతీయ భాషలో వందశాతం పాగా వేసినట్టేనన్న చర్చా వేడెక్కిస్తోంది.
ఇప్పటికే ఖాన్ లు అంతా 55 ప్లస్ ఏజ్ లో ఉన్నారు. వీళ్లంతా రిటైర్ మెంట్ తీస్కుంటే 40లో ఉన్న ప్రభాస్ మరో 15ఏళ్లు ఏలుకోవడం ఖాయంగానే కనిపిస్తోందన్న అంచనా వెలువడుతోంది. ప్రభాస్ ఏం చేసినా ఇక చెల్లుతుంది. డార్లింగా మజాకానా..! టిప్పర్ లారీ ఎల్లి స్కూటర్ ని గుద్దినట్టే ఉంటుంది మరి ప్లానింగ్!!