Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: చెర్రీ ది గ్రేట్
By: Tupaki Desk | 27 March 2020 4:44 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగాస్టార్ వారసుడిగా సినీప్రవేశం చేసి నేడు టాలీవుడ్ కి పవర్ స్టీరింగ్ లా ఎదిగిన స్టార్ హీరో. ఇంతింతై 100 కోట్ల బిజినెస్ .. 200 కోట్ల వసూళ్లు తేగలిగే సత్తా ఉన్న హీరోగా ఎదిగాడు. చిరుత చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన చరణ్ పై ఆరంభం యావరేజ్ మార్కులే వేశారు. ఆ తర్వాత మగధీర చిత్రంలో నటనకు చెర్రీకి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది. అయితే మగధీరతో రాజమౌళి ఇమేజ్ దర్శకధీరుడి రేంజుకు ఎదిగింది. ఇక చరణ్ అప్పటికి రెండు సినిమాల కిడ్ మాత్రమే. ఆ తర్వాత ఆరెంజ్ లాంటి ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. విలక్షణ లవ్ స్టోరీలో ప్రేమికుడిగా చరణ్ నటనకు పేరొచ్చినా నిర్మాత చేతికి డబ్బులు రాలేదు. భారీగా నష్టాలు రావడంతో అటుపై తేరుకునేందుకు చాలా సమయమే పట్టింది.
ఆ క్రమంలోనే నష్టనివారణ కోసం వరుసగా మాస్ యాక్షన్ చిత్రాల్లో నటించిన చరణ్ రచ్చ- నాయక్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. అయితే ఇవే సినిమాలు అతడిపై ఓ సెక్షన్ ఆడియెన్ కి కోపం తెప్పించాయి. రొటీన్ మాస్ హీరోగా మిగిలి పోవడం అభిమానులకే అయిష్టంగా మారింది. ఆ క్రమంలోనే ఫ్యామిలీ హీరో అనిపించుకునేందుకు గోవిందుడు అందరివాడేలే చిత్రంలో నటించాడు చరణ్. ఆ మూవీ నటుడిగా సంతృప్తినిచ్చినా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
అటుపై తమిళ మూవీ తని ఒరువన్ రీమేక్ ధ్రువ అతడికి పెద్ద ప్లస్ అయ్యింది. ఈ సినిమా కోసం చరణ్ పెట్టిన ఎఫర్ట్ కి ప్రశంసలు దక్కాయి. ఠఫ్ ఐపీఎస్ అధికారి ధ్రువ గా చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం చరణ్ బాడీని షేపప్ చేసిన తీరుకు సాహో అన్నారు. ఇక చరణ్ కెరీర్ దశ దిశ మార్చేసిన సినిమా రంగస్థలం. అప్పటివరకూ చరణ్ నటనపై అసంతృప్తి ఏమాత్రం ఉన్నా అదంతా చెరిగిపోయింది. నటుడిగా వందశాతం పరిపక్వతను చూపించడంలో చరణ్ సఫలం అయ్యాడు. చెవి వినిపించని చిట్టిబాబుగా వీర ప్రేమికుడిగా కుటుంబం కోసం హత్యకు గురైన అన్న కోసం కర్కోఠకంగా మారేవాడిగా చరణ్ అభినయం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాతోనే అతడు 200 కోట్ల క్లబ్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు. ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో పాన్ ఇండియా స్టార్ గా చరణ్ ఆవిర్భవించనున్నాడు. ఇక ఇటీవలే టైటిల్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజై అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. బాహుబలి తర్వాత మళ్లీ అంతటి రిజల్ట్ అందుకుంటే ఇక చరణ్ రేంజే మారిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ వారసుడే అయినా కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు.. అన్నిటినీ అధిగమించి తనని తాను మెగా పవర్ స్టార్ గా తీర్చిదిద్దుకున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అందుకే చెర్రీ ది గ్రేట్. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా తుపాకి తరపున శుభాకాంక్షలు.