Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ మారాల్సిందేనా?

By:  Tupaki Desk   |   27 Dec 2019 5:30 AM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ మారాల్సిందేనా?
X
తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం చాలా గ‌డ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. `బాహుబ‌లి`తో తెలుగు సినిమా కీర్తి ఎల్ల‌లు దాటింది. అదే స్థాయిలో బ‌డ్జెట్ కూడా ప‌రిధి దాటింది కానీ ఆ స్థాయి లో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోతోంది. తెలుగు సినిమా స్పాన్ పెరిగినా ఇంకా కీల‌క స‌మ‌స్య‌లు ఇండ‌స్ట్రీని ప‌ట్టి పీడిస్తూనే వున్నాయి. బ‌డ్జెట్ కోట్ల‌లోకి చేర‌డంతో పారితోషికాల స‌మ‌స్య వెంటాడుతోంది. అక్క‌డ త‌గ్గించినా క్వాలిటీ విష‌యం లో రాజీ ప‌డ‌కూడ‌దంటే భారీ గా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి.

దీనికి తోడు మారుతున్న ప్రేక్ష‌కుడి అభిరుచి.. ఆలోచ‌నా ధోర‌ణి మ‌రింత సంక‌టంగా మారుతోంది. స‌గటు ప్రేక్ష‌కుడు థియేట‌ర్ కు రావాలంటే స‌వాల‌క్ష కార‌ణాలు చూపించాలి. ఎందుకు త‌మ సినిమాని చూడాలో అర్ధ‌మ‌య్యేలా కొత్త థాట్స్ తో.. సినిమాలు చేయాలి. కాన్సెప్ట్ బేస్డ్ తీస్తే స‌రిపోదు.. పాన్ ఇండియా గ్రాండియారిటీతో భారీ స్థాయిలో సినిమాలు రావాల‌ని కోరుకునే ట్రెండ్ ఉంది. ఇదంతా చేసినా ప్రేక్ష‌కుడు ఈ రోజుల్లో థియేట‌ర్ కు క‌చ్చితంగా వ‌స్తాడ‌న్న గ్యారెంటీ లేదు. దీనికి కార‌ణం స్మార్ట్ వినోదం.. ఇంట్లోనే నేరుగా ల‌భించ‌డం. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్‌- నెట్‌ఫ్లిక్స్ 129కే నెల‌స‌రి ఇంటిల్లిపాది చూసే వినోదాన్ని అందిస్తున్నాయి. దీంతో ప్రేక్ష‌కుడు గ‌డ‌ప దాటి థియేట‌ర్ కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ఇటీవ‌ల తెలుగు సినిమా అమెరికా మార్కెట్ దారుణం గా దెబ్బ‌ తిన‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఈ ఏడాది మొత్తం 190 స్ట్రెయిట్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో స‌క్సెస్ సాధించి 19 మాత్ర‌మే పెట్టుబ‌డిని తిరిగి రాబ‌ట్టాయి. అంటే స‌క్సెస్ రేట్ 10 శాతం మాత్ర‌మే అన్న‌మాట‌. స‌క్సెస్ రేట్ వచ్చే ఏడాది కూడా ఇలాగే వుంటే క‌ష్ట‌మే. ప‌రిస్థితిలో చాలా మార్పులు రావాల్సిందే. ముఖ్యంగా స్టార్స్ రెమ్యున‌రేష‌న్స్‌.. మూవీ బ‌డ్జెట్స్ లో మార్పులు రాక‌పోతే ఇండ‌స్ట్రీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిన‌ట్టే. ఇక‌పోతే పాన్ ఇండియా ఫీవ‌ర్ వ‌ల్ల అతి భారీ చిత్రాలు రావాల్సిందే అనే ధోర‌ణి పెరిగితే అది మ‌రింత‌గా తీవ్ర ప‌రిణామాలకు దారి తీయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.