Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో విగ్ ల డిమాండ్ పెరిగిందా

By:  Tupaki Desk   |   30 Jan 2020 2:30 PM GMT
టాలీవుడ్ లో విగ్ ల డిమాండ్ పెరిగిందా
X
ఒక‌ప్పుడు స్టేజీ ఆర్టిస్టులు విగ్గులు ఉప‌యోగించేవారు. అందుకోసం హైద‌రాబాద్- బొంబాయి- మ‌ద్రాసు వంటి చోట్ల‌కు వెళ్లి కొనుక్కునే వారు. విలేజ్ లో డ్రామా ఉంది అంటే ముందుగా విగ్గు స‌వ‌రించుకునేవారు. విగ్గు ఎంత క్లాస్ గా ఉంటే డ్రామా అంత‌గా ర‌క్తి క‌డుతుంద‌ని ఆర్టిస్టుగా త‌మ ఇమేజ్ అంత‌గా జ‌నంలో పెరుగుతుంద‌ని ప్రెస్టేజ్ ఫీల‌య్యేవారు. విగ్గుకోసం ఎంత ఖ‌ర్చు చేసేందుకైనా వెన‌కాడేవారు కాదు.

కాల‌క్ర‌మంలో ఈ విగ్గుల వాడ‌కం ఇటు సినీప‌రిశ్ర‌మ‌కు పాకింది. స్టేజీ డ్రామా ఆర్టిస్టులే ఇటువైపు వ‌చ్చి సినీ ఆర్టిస్టులుగా స్థిర‌ప‌డ‌డంతో విగ్గు క‌ల్చ‌ర్ ఇక్క‌డా పెరిగింది. ఇక ఇటీవ‌లి కాలంలో విగ్గు లేనిదే ఆర్టిస్టు బ‌త‌క‌ లేని ప‌రిస్థితి వ‌చ్చేసింద‌ట‌. ఏదో సినిమాలో క‌నిపించే వ‌ర‌కూ విగ్గు వాడితే స‌రే కానీ.. ఆ విగ్గును బ‌య‌ట కూడా కంటిన్యూ చేస్తూ ఫోజులు కొట్టే ఆర్టిస్టులు ఎక్కువైపోయార‌న్న‌ది ఫిలింన‌గ‌ర్ కృష్ణాన‌గ‌ర్ గుస‌గుస. ఇది నిజం హెయిరేనా? లేక పెట్టుడు విగ్గా? అన్న డౌట్ దారిన పోయే దాన‌య్య‌ల‌కు క‌లుగుతోంది.

ఇటీవ‌లి కాలంలో స‌క్సెస్ (ప్రెస్) మీట్ల‌కు.. స్టేజీ కార్య‌క్ర‌మాల‌కు.. ఫంక్ష‌న్ల‌కు సైతం విగ్గు ధ‌రించే ఎటెండ‌వుతున్నార‌ట కొంద‌రైతే. ఫంక్ష‌న్ల‌కు వెళ్లే ముందు అద్దంలో చూసుకుని విగ్గును స‌వ‌రించుకుని అన్నీ కుదిరాయో లేదో చెక్ చేసుకుంటున్నార‌ట‌. ఇంత‌కుముందు సోకుల రాయుళ్లు శోభ‌న్ బాబులు అయితే డ్రెస్ నీట్ గా ఉందా లేదా? అని చూసుకునేవారు. అటుపై క్రాఫ్ స‌రిగా కుదిరిందో లేదో .. చొక్కా మ‌డ‌త‌డిపోయిందా? ఇస్త్రీ న‌లిగిందా? అంటూ తెగ ఇదై పోయేవారు. మ‌హా అయితే వాచ్ ఉందా? షూస్ నీట్ గా ఉన్నాయా? అని త‌డిమి చూసుకునేవారు. అన్నీ బావున్నాయి అనుకోగానే వీధుల్లో షికార్ కి వెళ్లిపోయేవారు. అప్ప‌ట్లో శోభ‌న్ బాబు .. కృష్ణ‌.. ఎన్టీఆర్.. ఏఎన్నార్ లాంటి వాళ్లు విగ్గులు స‌వ‌రించుకుంటే అది రొటీన్ గా క‌నిపించేది. ఇటీవ‌ల కాలంలో సీనియ‌ర్ హీరోలు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌తో పాటు సైడు ఆర్టిస్టులు వంటి వాళ్లు విగ్గుల్ని ధ‌రించేస్తూ సోకుల‌కు పోతున్నారు. ఇదేమి చోద్య‌మో కానీ ఇటీవ‌ల యువ హీరోలు.. హీరోయిన్లు కూడా విగ్గు పూజ్యులు గా మారి వాటి కోసం వెతికేస్తున్నార‌ట‌. ఏదో ఏజ్డ్ ప‌ర్స‌న్స్ అయితే ఫ‌ర్వాలేదు కానీ.. ఇలా కుర్రకారు కూడా విగ్గో రామ‌చంద్రా అంటే ఏం బావుంటుంది? ఒక్కోసారి ఆ విగ్గు ఎబ్బెట్టు గా క‌నిపించి దొరికి పోతున్నా .. ఎందుకని ప‌ట్టించుకోరూ? అయినా ఈ విగ్గు పిచ్చేంటి?