Begin typing your search above and press return to search.
పిచ్చి కామెడీ సినిమా సూపర్ హిట్
By: Tupaki Desk | 25 Feb 2019 11:21 AM GMT2007వ సంవత్సరంలో వచ్చిన 'ఢమాల్' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు విమర్శకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది. కాని కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. ఆ తర్వాత కూడా ఢమాల్ సీక్వెల్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఢమాల్ సిరీస్ లో మూడవ భాగం అయిన 'టోటల్ ఢమాల్' చిత్రం వచ్చింది. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్యాడ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఎప్పటిలాగే ఈ సినిమాకు బ్యాడ్ రివ్యూలు వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగా వస్తున్నాయి.
మొదటి మూడు రోజుల్లో ఏకంగా 60 కోట్లను వసూళ్లు చేసింది. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అంటూ బాలీవుడ్ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన టోటల్ ఢమాల్ చిత్రం ఢమాల్ అనకుండా మంచి వసూళ్లను నమోదు చేస్తున్న నేపథ్యంలో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు, ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండటంతో ఈ చిత్రంకు కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.
ఈ చిత్రంలో కామెడీ మాత్రమే ఉంటుంది, ఆ కామెడీ లాజికల్ గా ఉండదు. ఏ ఒక్క సీన్ కూడా లాజిక్ తో ఉండదు. అప్పట్లో తెలుగులో సంపూర్నేష్ బాబు 'సింగం 123' చిత్రం ఎలా లాజిక్ లేని కామెడీతో వచ్చిందో అదే తరహాలో టోటల్ ఢమాల్ కూడా ఉంటుంది. లాజిక్ లేకున్నా కామెడీ మస్త్ గా ఉండటంతో ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రితేష్ దేష్ ముఖ్, అర్షద్ వార్షి, మాధురి దీక్షిత్, అనీల్ కపూర్ వంటి స్టార్స్ ఉన్న కారణంగా కూడా కలెక్షన్స్ భారీగా నమోదు అవుతున్నాయి. ఈ ఏడాదిలో 'గల్లీ బాయ్' తర్వాత ఈ చిత్రం హిట్ గా నిలిచింది.