Begin typing your search above and press return to search.
కరోనా వల్ల టాలీవుడ్ కి నష్టమెంత?
By: Tupaki Desk | 23 March 2020 11:30 PM GMTవరుసగా రెండు వారాల పాటు సినిమాల రిలీజ్ లు లేకపోయినా.. షూటింగులు లేకపోయినా టాలీవుడ్ పరిస్థితేమిటి?.. జనజీవనం స్థంభించిపోయిన ప్రస్తుత సన్నివేశంలో కార్మికుల జీవనోపాధి మాటేమిటి? అంటూ ప్రస్తుతం విశ్లేషణలు సాగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ కి ఏ మేరకు నష్టాలొస్తాయి? అన్న అంచనా వేస్తే..
ఇలాంటి విపత్తుల వల్ల తొలిగా దారుణంగా దెబ్బ తినేది నిర్మాతలు మాత్రమే కాదు.. కార్మికులు కూడా. ఇక్కడ ఉపాధి పొందే చిన్నా చితకా కార్మికులు కనీస తిండికి నోచుకోని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. రోజుల తరబడి భత్యం లేనిదే బతుకు సాగదు. ఒకటో తేదీ కి రెంటు కట్టకపోతే ఇంటి వోనర్ తరిమేసే పరిస్థితి ఉంటుంది. ఇకపోతే నిర్మాతల గోడు వేరొక రకంగా ఉంది. వీళ్లు రిలీజ్ కి వచ్చిన సినిమాని నిలిపేస్తే బిజినెస్ పరంగా తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సకాలంలో రిలీజ్ కాని సినిమాలకు పంపిణీ వర్గాలు .. ఫైనాన్షియర్స్ సహా .. థియేటర్ల వైపు నుంచి బోలెడన్ని చిక్కులు ఉంటాయి. ఇక షూటింగులు ఆపేస్తే అది కూడా రకరకాలుగా నష్టం కలిగిస్తుంది. ఆర్టిస్టుల కాల్షీట్లు తిరిగి పట్టుకోవడం అంత సులువేమీ కాదు.
ప్రస్తుతం చాలా సినిమాల రిలీజ్ లు వాయిదాపడగా.. షూటింగులో ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. ఇందులో భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో లాక్ డౌన్ సమయం ముగిసేనాటికి నష్టాలు అన్ని ఇండస్ట్రీల్లో కలుపుకుని దాదాపు 1200 కోట్లు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటు తెలుగు పరిశ్రమ సహా అటు బాలీవుడ్.. తమిళం .. మలయాళ పరిశ్రమలు తీవ్రమైన క్రైసిస్ లో ఉన్నాయి. రెండు వారాలు బిజినెస్ లేకపోతే ఆ మేరకు నష్టాలు తీవ్రంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక ఇలాంటి టైమ్ లో నష్టనివారణ కోసం థియేటర్ యాజమాన్యాలు సహా పంపిణీ వర్గాలు నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిలీజ్ కోసం వెయిటింగులో ఉన్న నిర్మాతల సన్నివేశం మరీ దారుణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. చూద్దాం.. కరోనా మహమ్మారీని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎంతవరకూ ఫలించి వినోదపరిశ్రమకు మేలు జరుగుతుందో.