Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: స్టయిలిష్ టచ్ చేసి చూడు
By: Tupaki Desk | 6 Jan 2018 5:23 AM GMTమాస్ పవర్ చూపించమంటే ముందే ఉంటాడు రవితేజ. ఇక పోలీస్ ఆఫీసర్ గా రెండుమూడుసార్లు తన పవర్ ను బాగానే చూపించాడు. ఇప్పుడు మరోసారి అదే చూపించడానికి 'టచ్ చేసి చూడు' అంటూ వచ్చేస్తున్నాడు. మొన్నటివరకు స్ర్కీన్ ప్లే రచయితగా సురేందర్ రెడ్డి వంటి దర్శకులకు సాయం చేసిన విక్రమ్ సిరికొండ.. ఈ సినిమాతో డైరక్టర్ గా మారుతున్నాడు.
ఇక 'టచ్ చేసి చూడు' సినిమా టీజర్ విషయానికొస్తే.. స్లో మోషన్లో ఒక రౌడీని లాగి గాల్లోకి పడేసే షాటుతో.. ఇదో మాస్ మసాలా కమర్షియల్ సినిమా అని చెప్పకనే చెప్పారు. టీజర్ చూస్తే స్టయిలిష్ గా.. అలాగే ప్రీతమ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఇంపుగా ఉంది. కాకపోతే రవితేజ మాత్రం అచ్చం గతంలో 'పవర్' సినిమాలో ఎలా కనిపించాడో అదే తరహాలో కనిపిస్తున్నాడు. అయితే ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు బాగానే పెరిగే ఛాన్సుందని చెప్పాలి.
ఇకపోతే టచ్ చేసి చూడు సినిమాను ముందుగా సంక్రాంతికి అనుకున్నా.. తరువాత సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని యోచించారు. కాని లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజయ్యే ఛాన్సుంది.