Begin typing your search above and press return to search.
15 సెంచరీలతో సల్మాన్ తర్వాత కిలాడీనే!
By: Tupaki Desk | 12 Nov 2021 5:13 AM GMTఅక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన `సూర్యవంశీ` ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే 30 కోట్లు వసూళ్లు తెచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి భారీ విజయం నమోదు చేసింది. ఐదు రోజుల్లోనే 103.59 కోట్లు వసూళ్లు తెచ్చింది. ప్రస్తుతం `సూర్యవంశీ` వేగం చూస్తుంటే అక్షయ్ కుమార్ గత సినిమాల రికార్డులు తిరగరాడం ఖాయంగా కనిపిస్తోంది. అక్షయ్ కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలు 11 వరకూ ఉన్నాయి. మరో మూడు చిత్రాలు 200 కోట్ల క్లబ్ లో ఉన్నాయి.
`హౌస్ ఫుల్ 4`- 20.8.50 కోట్లు.. `గుడ్ న్యూజ్`-205.14 కోట్లు.. `మిషన్ మంగళ్` -203 కోట్లు..`2.0` - 189 కోట్లు (హిందీలో).. `కేసరి`-154.42 కోట్లు.. `టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ`-134.25 కోట్లు..` రౌడీ రాథోడ్`-133 కోట్లు..`ఎయిర్ లిప్ట్` 129 కోట్లు.. `రుస్తుం`-128 కోట్లు.. `జాలీ ఎల్.ఎల్.బీ-2`-116 కోట్లు..`హాలీడే`-113 కోట్లు..` హౌస్ ఫుల్`-109 కోట్లు.. `గోల్డ్`-105 కోట్ల వసూళ్లను రాబట్టాయి. వీటిలో మొదటి మూడు సినిమాలు మినహా `2.0` హిందీ రికార్డును `సూర్యవంశీ` తిరగరాస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే అక్షయ్ ఇమేజ్ అమాంతం స్కైని తాకినట్టే. సూర్యవంశీ`తో అక్షయ్ కుమార్ కెరీర్ లో 15వ 100 కోట్ల వసూళ్ల చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సెంచరీలు కొట్టిన స్టార్ గా పేరుగాంచిన సల్మాన్ ఖాన్ సరసన అక్షయ్ కుమార్ నిలిచారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హీరోగా స్మలాన్ కి మంచి పేరుంది. ఇప్పుడు కిలాడీ పేరు బాక్సాఫీస్ వద్ద మర్మోగుతోంది. సెకండ్ వేవ్ అనంతర సమయంలో `సూర్యవంశీ` వందకొట్లు తెచ్చిన తొలి హిందీ (భారతీయ) సినిమాగానూ రికార్డు సృష్టించింది. అక్షయ్ గత సినిమా `బెల్ బాటమ్` భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడిన సంగతి తెలిసిందే. రివ్యూలు బావున్నా కోవిడ్ విలయం వల్ల సరిగా ఆడలేదని టాక్ వినిపించింది.