Begin typing your search above and press return to search.
సాహో చుట్టూ పోటీ ముప్పు
By: Tupaki Desk | 16 July 2019 7:11 AM GMTడార్లింగ్ ప్రభాస్ సాహో విడుదలకు నెల రోజుల కంటే తక్కువ టైం ఉంది. అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. ప్రమోషన్ విషయంలో స్లోగా ఉండటం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికి ప్యాచ్ వర్క్ ఫినిష్ చేయడంలో యూనిట్ బిజీగా ఉండటంతో ప్రభాస్ సైతం మీడియా ముందుకు రాలేకపోతున్నాడు. ఆగస్ట్15 తేదిలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి పబ్లిసిటీ వేగం పెంచాల్సి ఉంది.
ఇదిలా ఉండగా సాహో లాంటి విజువల్ వండర్ బరిలో ఉన్నప్పుడు సాధారణంగా ఎవరూ పోటీలో ఉండరు. కాని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా అబ్బే మాకేం భయం లేదు అనే తరహాలో కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే హిందిలో అదే రోజు అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ జాన్ అబ్రహం బాట్లా హౌస్ నార్త్ లో సాహో ఓపెనింగ్స్ కి టెండర్ పెట్టె ఛాన్స్ ఉండగా తెలుగులో కేవలం ఆరు రోజుల ముందు మన్మధుడు 2తో వస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే దీని రెండు టీజర్లు వచ్చేశాయి
ఇవి చాలదు అన్నట్టు ఆగస్ట్ 8న తలా అజిత్ కొత్త సినిమా నీర్కొండ పార్వై వస్తోంది. అప్పుడే టికెట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టేశారు. ఇది తెలుగు వెర్షన్ వచ్చే ఛాన్స్ లేదు కాని తమిళనాడు కేరళలో అజిత్ మార్కెట్ బలంగా ఉండటం కొంత ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ లేకపోలేదు. సాహోకు దీనికి వారం గ్యాప్ ఉన్నప్పటికీ ప్రభాస్ కోసం అజిత్ సినిమాని అంత తక్కువ వ్యవధిలో ధియేటర్లలో నుంచి తీసేసే ఛాన్స్ ఉంది.
ఈ లెక్కన ఆగస్ట్ 15 నాటికి చాలా పోటీ ఉండేలా కనిపిస్తోంది. ప్రేక్షకులకు ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగుందన్న సినిమాకే వెళ్తాడు కాని బడ్జెట్ ఎక్కువ పెట్టారన్న సానుభూతితో టికెట్లు కొనడు. సో సాహో ఎక్స్ ట్రాడినరి అనే టాక్ తెచ్చుకోవడం కంపల్సరీ. ఇంత పోటీని తట్టుకోవడం అంత ఈజీ కూడా కాదు