Begin typing your search above and press return to search.
అల్లుడి అసలు సత్తా ఇప్పుడు తెలుస్తుంది
By: Tupaki Desk | 16 Sep 2018 9:02 AM GMTవినాయక చవితి కానుకగా విడుదలైన ‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి రోజు అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. దీనికి సమీక్షలు సానుకూలంగా ఏమీ రాలేదు. సోషల్ మీడియాలోనూ డివైడ్ టాక్ కనిపించింది. అయినప్పటికీ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలుండటం.. పండగ సెలవు రోజు రిలీజ్ కావడం బాగా కలిసొచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత సరైన సినిమా పడకపోవడంతో యూత్.. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. సినిమా పాతగా ఉన్నప్పటికీ.. కుటుంబ ప్రేక్షకులు కోరుకునే అంశాలుండటం ప్లస్ అయింది. దీంతో తొలి రోజు టాక్ తో సంబంధం లేకుండా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా రన్ అయింది. రెండో రోజు వసూళ్లు సాధారణ స్థాయిలోనే తగ్గాయి తప్ప.. మేజర్ డ్రాప్ ఏమీ లేదు. వీకెండ్లో కూడా సినిమా బాగానే ఆడేస్తోంది.
ఆలస్యం చేయకుండా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టేసింది. సాధారణంగా సినిమాలపై సమీక్షల ప్రభావం చాలా ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం అందుకు మినహాయింపు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆ కోవలోకే చేరిందని అంటున్నారు. ఐతే ఈ చిత్రానికి కలిసొచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రిలీజ్ టైమింగ్ బాగా ప్లస్ అయింది. కాబట్టి సినిమా అంతిమ ఫలితంపై ముందే ఒక అంచనాకు వచ్చేయలేం. వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడింది కానీ.. ఇంకా సేఫ్ జోన్లోకి మాత్రం రాలేదు. ఇంకా బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రాలేదు. వీకెండ్ తర్వాత కూడా సినిమా నిలబడితేనే అందరూ సేఫ్ అవుతారు. కాబట్టి సోమవారం నుంచి సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుంది. రెండో వీకెండ్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్నది కీలకం. సోమవారం మేజర్ డ్రాప్ ఉంటే మాత్రం సినిమా నష్టాలు మిగల్చడం ఖాయం. మరి రేపటి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.