Begin typing your search above and press return to search.
బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా రికవరీ కష్టమే
By: Tupaki Desk | 31 Oct 2017 5:30 PM GMTతెలుగు సినిమాల బడ్జెట్లు ప్రధానంగా హీరోల మార్కెట్ ను బట్టే ఉంటాయి. సినిమాలో ఎంత విషయం ఉన్నప్పటికీ హీరో మార్కెట్.. బిజినెస్ అంచనాల్ని బట్టే సినిమాకు ఖర్చు చేస్తుంటారు. ఐతే సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త సినిమా ‘గరుడవేగ’కు మాత్రం ఇలాంటివేమీ చూసుకోలేదు. స్వయంగా రాజశేఖరే తనకు ఇప్పుడంత మార్కెట్ లేదని.. తన మార్కెట్ స్థాయిని మించి ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టేశారని అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ మీద ఇప్పుడు రూ.10 కోట్లు పెట్టినా కష్టమే అన్నట్లుంది. అలాంటిది ‘గరుడవేగ’కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్న మాట వాస్తవమే.
కానీ ‘గరుడ వేగ’కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా పెట్టుబడి రికవర్ అవుతుందా అన్నది సందేహమే. పైగా ఈ సినిమాను అన్ సీజన్లో రిలీజ్ చేస్తున్నారు. అందులోనూ దీంతో పాటుగా మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదని సమాచారం. నిర్మాత చెప్పిన రేట్లకు కొనడానికి బయ్యర్లు ముందుకు రాకపోవడంతో కొంచెం తగ్గి అయిన కాడికి సినిమాను అమ్మేశారట. సినిమాను రిలీజ్ చేయడానికి వేరేగా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందట. మూడు సినిమాలతో పోటీ పడుతుండటంతో థియేటర్ల సమస్య కూడా తలెత్తినట్లు సమాచారం. గతంలో రామానాయుడికి చికిత్స చేయడం ద్వారా దగ్గుబాటి కుటుంబానికి రాజశేఖర్ కొంత దగ్గరయ్యాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘గరుడవేగ’కు థియేటర్లు ఇచ్చే విషయంలో సురేష్ బాబు కొంత సాయం చేసినట్లు సమాచారం. తన కెరీర్ కు ‘గరుడవేగ’ ఎంత కీలకమో చెప్పి థియేటర్ల కోసం రాజశేఖర్ ఇంకొందరు ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.