Begin typing your search above and press return to search.
'మిన్నల్ మురళి' తెలుగు ట్రైలర్: అలరిస్తోన్న లోకల్ సూపర్ హీరో..!
By: Tupaki Desk | 30 Oct 2021 6:54 AM GMTఇటీవల 'కాలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళ వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్.. ఇప్పుడు ''మిన్నల్ మురళి'' అనే సినిమాతో వస్తున్నాడు. గ్లోబల్ పవర్స్ ఉన్న లోకల్ సూపర్ హీరో కథాంశంతో రూపొందిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల కాబోతోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ నెట్ ఫ్లిక్స్ లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతుంది.
''మిన్నల్ మురళి'' సినిమాను మలయాళంతో పాటుగా తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - మలయాళ టీజర్ & ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఇండియా తెలుగు వెర్సన్ ట్రైలర్ ను శుక్రవారం లాంచ్ చేసింది.
పిడుగు పడటం వల్ల ఉత్పన్నమైన లైటెనింగ్ శక్తితో ఒక సాధారణ యువకుడు అసాధారణ పవర్స్ పొంది సూపర్ హీరోగా ఎలా మారాడు.. ఆ తర్వాత ఎలాంటి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ఈ ట్రైలర్ లో ఆసక్తికరంగా వినోధబరితంగా చూపించారు. సాధారణంగా సూపర్ హీరోల సినిమాలలో ఉండే యాక్షన్ తో పాటుగా కామెడీని మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇండియన్ సూపర్ మ్యాన్ 'క్రిష్' సినిమాల తరహాలో 'మిన్నల్ మురళి' చేసే సాహసాలు వీక్షకులను అలరిస్తున్నాయి. తనకున్న అతీంద్రీయ శక్తులతో రౌడీల ఆటకట్టిస్తుండగా.. మురళి కనిపిస్తే తమకు తెలిజేయాలని పోలీసులు ఓ గంటను ఏర్పాటు చేశారు. ఇక మన లోకల్ సూపర్ హీరో కరాటే తెలిసిన అమ్మాయిని ప్రేమలోకి దింపే ప్రయత్నాలు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి.
స్పైడర్ మ్యాన్ - బ్యాట్ మ్యాన్ - సూపర్ మ్యాన్ గురించి ఎప్పుడైనా విన్నవా? అని ఓ పిల్లాడు అడుగగా.. వాళ్ళు ఎవరు? అని టోవినో అడగడం అతని పాత్రలోని ఇన్నోసెన్స్ ని తెలియజేస్తోంది. సూపర్ హీరోగా టోవినో అలరించగా.. గురు సోమ సుందరం - హరిశ్రీ అశోకన్ - అంజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. మొత్తం మీద రూరల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన 'మిన్నల్ మురళి' సినిమా ట్రైలర్ బాగుంది.
''మిన్నల్ మురళి'' చిత్రానికి బేసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 'బెంగుళూరు డేస్' నిర్మాత సోఫియా పాల్ ఈ సినిమాని వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ పై నిర్మించారు. షాన్ రహమాన్ - సుశీన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వ్లాద్ రిమ్ బర్గ్ యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. మాస్ కమర్షియల్ సినిమాలకే పట్టం కట్టే భారతీయ ప్రేక్షకులు కూడా వాటిని అమితంగా ఇష్టపడతారు. కాకపోతే ఇండియాలో సూపర్ హీరో పాత్రలు చాలా తక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో విభిన్నమైన చిత్రాలతో విజయాలు అందుకుంటూ వస్తున్న టోవినో థామస్.. 'మిన్నల్ మురళి' అనే సూపర్ హీరోగా రాబోతున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.