Begin typing your search above and press return to search.

మాస్ లో చితక్కొట్టేసే ఛాన్సుంది గురూ

By:  Tupaki Desk   |   18 Aug 2017 1:17 PM GMT
మాస్ లో చితక్కొట్టేసే ఛాన్సుంది గురూ
X
ఒక ప్రక్కన నందమూరి బాలకృష్ణ అభిమానులకు సినిమా ట్రైలర్ విపరీతంగా నచ్చేస్తే.. మిగతావారికి మాత్రం పెద్దగా కిక్కివ్వలేదు. రొటీన్ గానే ఉంది కదా.. పూరి జగన్ హీరోలందరూ ఇదే ఫార్మాట్ లో ఉంటారు కదా.. అంటూ పెదవి విరుస్తున్నారు కొందరు సినిమా లవ్వర్స్ . అయితే ''పైసా వసూల్'' సినిమాను ఇప్పుడు ట్రేడ్ వర్గాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. పదండి ఎందుకో చూద్దాం.

అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు క్రిటిక్స్ కు క్లాస్ ఆడియన్స్ కు నచ్చలేదు. ఎందుకంటే స్టోరీలు పరమ రొటీన్ గా ఉంటున్నాయి. ఆ సినిమాల్లో కంటెంట్ ఏమాత్రం ఉండట్లేదు. కాని మాస్ కు కావాల్సిన అంశాలు మాత్రం పుష్కళంగా ఉంటున్నాయి. అందుకే ఆ సినిమాలు 70+ కోట్లు వసూలు చేస్తున్నాయి. అదే యాంగిల్లో చూస్తూ.. అసలు ఇలాంటి డైలాగులు తేడా సింగ్ వరుసగా పేల్చుకుంటూ పోతే.. రేపు మాస్ సెంటర్లలో 'పైసా వసూల్' రచ్చ చేయడం ఖాయం. ఈ మధ్య కాలంలో వచ్చిన మాస్ సినిమాలకు అన్నేసి కోట్లు కలక్షన్లు వచ్చాయంటే అది కేవలం బి అండ్ సి సెంటర్ల వలనే. కాబట్టి ఆ సెంటర్లపైనే ఇప్పుడు పైసా వసూల్ గురిపెడుతోంది. పైగా మరీ స్టోరీ లేకుండా పూరి ఈ సినిమా తీసేసుండడు. అందువలన ఖచ్చితంగా మాస్ లో చితక్కొట్టేసే ఛాన్సుంది గురూ.

మొన్నటివరకు అసలు ఈ సినిమా బిజినెస్ ను కాస్త హోల్డ్ లో పెట్టమని పూరి చెప్పడం చూస్తే.. తప్పు చేస్తున్నారేమో అనిపించింది కాని.. పూర్తి స్థాయి మాస్ ట్రైలర్ చూశాక మాత్రం ట్రేడ్ వర్గాల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే మనోడు భలే రైట్ డైరక్షన్లోనే ఆలోచించాడని ఎవరైనా అనుకోవాల్సిందే.