Begin typing your search above and press return to search.
మెగా స్టామినా.. 100 కోట్లు పక్కా!!
By: Tupaki Desk | 25 Jan 2017 7:48 AM GMTమెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. ఫుల్ రన్ లో కనీసం 95 కోట్ల వసూళ్లు సాధిస్తుందని గతంలోనే అంచనాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను మించి దూసుకుపోతున్నాడు ఖైదీ. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ లో సెకండ్ ప్లేస్ లోకి ఇప్పటికే చేరుకున్న మెగాస్టార్ మూవీ.. ఫుల్ రన్ కలెక్షన్స్ ఎంత ఉంటాయనే ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.
ఇప్పటివరకూ ఖైదీ నంబర్ 150కి వచ్చిన మొత్తం కలెక్షన్స్ 92.5 కోట్లను దాటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీకెండ్ లో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేయగల సత్తా ఉన్న సినిమాలేవీ లేవు. దీంతో మూడో వారాంతం నాటికి ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్.. కచ్చితంగా 100 కోట్ల షేర్ వసూళ్ల మార్క్ ను అందుకోవడం ఖాయం అంటున్నారు ఎనలిస్టులు. రిపబ్లిక్ డే తో కలిపి లాంగ్ వీకెండ్ ఉండడంతో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగేందుకు కూడా అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద ఖైదీ నంబర్ 150 ఫుల్ రన్ షేర్.. 100 నుంచి 105 కోట్ల మధ్యలో ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు తాజాగా చెబుతున్నాయి.
పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ.. ఇప్పటి స్టార్ హీరోలతో సమానంగా వసూళ్లను.. చిరంజీవి రాబట్టగలుగుతారా అన్న ప్రశ్నకు.. మెగాస్టార్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇది. కమర్షియల్ సినిమా సత్తా ఏంటో మరోమారు చూపించారు చిరంజీవి. ఒక సాధారణమైన మాస్ మూవీతోనే 100 కోట్ల వసూళ్లు సాధిస్తే.. ఇక చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ హిస్టారికల్ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెరకెక్కితే మాత్రం.. ఆ ప్రభంజనాన్ని అంచనా వేయడం చాలా కష్టం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/