Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ -హృతిక్ మ‌ల్టీస్టార‌ర్ యువీలోనేనా?

By:  Tupaki Desk   |   8 July 2020 3:30 AM GMT
ప్ర‌భాస్ -హృతిక్ మ‌ల్టీస్టార‌ర్ యువీలోనేనా?
X
డార్లింగ్ ప్ర‌భాస్ సినిమా అంటే అది కచ్ఛితంగా యువి క్రియేష‌న్స్ లోనే ఉంటుంద‌నేది తెలిసిన వ్య‌వ‌హార‌మే. స్నేహితులతో క‌లిసి ప్ర‌భాస్ ఈ బ్యాన‌ర్ ని విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన త‌ర్వాత ప్ర‌భాస్ యు.వి.క్రియేష‌న్స్ లోనే వ‌రుస‌గా రెండు చిత్రాల్లో న‌టించారు. బాహుబ‌లి ఫ్రాంఛైజీని ఆర్కా మీడియా సంస్థ స‌క్సెస్ చేసింది. ఆ త‌ర్వాత `సాహో` చిత్రం యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి రిలీజైంది. ఆ సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సాహో సెట్స్ లో ఉండ‌గా‌నే ప్ర‌భాస్ 20 చిత్రాన్ని కూడా ఇదే బ్యాన‌ర్ లో ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి రాధేశ్యామ్ అనే టైటిల్ వినిపిస్తోంది. చిత్రీక‌ర‌ణ ముగింపులోనే ఉండ‌గా మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది.

ప్ర‌భాస్ 21 ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ లో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించే 22వ సినిమా గురించి ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2021 ఎండింగ్ లేదా 2022లో ప్రారంభ‌మ‌య్యే ఈ మూవీకి బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

అయితే ఈ మూవీని ఏ బ్యాన‌ర్ లో నిర్మిస్తారు? అన్న‌దా‌నికి మాత్రం ఇంత‌వ‌ర‌కూ స‌రైన క్లారిటీ లేదు. ఒక‌వేళ ప్ర‌భాస్ 22 లో హృతిక్ న‌టిస్తే అది భారీ మ‌ల్టీస్టార‌ర్ గా అవ‌త‌రిస్తుంది. అప్పుడు క‌చ్ఛితంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థ టై అప్ త‌ప్ప‌నిస‌రి అని భావిస్తున్నారు. అలాంట‌ప్పుడు ప్ర‌భాస్ కి చెందిన‌ యువి క్రియేష‌న్స్ సంస్థ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో భాగ‌స్వామ్యంలో ఈ మూవీని నిర్మించే వీలుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ మూవీ బ‌డ్జెట్ రేంజ్ కూడా ఊహించ‌నంత‌గా ఉంటుంద‌ని ఫ్యాన్స్ లో ఎగ్జ‌యిట్ మెంట్ నెల‌కొంది. అయితే దీనిని అధికారికంగా క‌న్ఫామ్ చేస్తూ డార్లింగ్ ఏదైనా స‌మాచారం ఇస్తారేమో చూడాలి.