Begin typing your search above and press return to search.
టాప్ 15 సౌతిండియన్ గ్రాసర్స్
By: Tupaki Desk | 28 Nov 2018 6:11 AM GMT2.0 రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ ఈ సినిమా ఎలాంటి రికార్డుల్ని అందుకోబోతోందోనన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఇప్పటివరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న అన్ని రికార్డుల్ని 2.0 చెరిపేస్తుందా? అంటూ రజనీ - శంకర్ - అక్షయ్ ఫ్యాన్స్ లో హాట్ డిబేట్ రన్ అవుతోంది. ఒకవేళ 2.0 వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా రికార్డుల్ని వేటాడాలంటే ఏ రేంజులో సంచలనం సృష్టించాల్సి ఉంటుందో అన్న లెక్కలు తీస్తున్నారు.
ఇప్పటివరకూ ఇండియాలో నంబర్ 1 వసూళ్ల సినిమాగా `బాహుబలి 2` చరిత్ర సృష్టిస్తే - ఆ తర్వాత రెండో స్థానంలో దంగల్ (ఇండియా వసూళ్ల వరకూ) నిలిచింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ల పరంగా దంగల్ నంబర్ 1 స్థానంలో ఉంటే - ఆ తర్వాతి స్థానంలో బాహుబలి 2 రికార్డులకెక్కింది. కేవలం సౌత్ వరకూ సౌత్ సినిమాల రికార్డులు పరిశీలిస్తే 2.0 సౌత్ లో టాప్ గ్రాసర్ గా నిలవాలన్నా `బాహుబలి 2`ని కొట్టాల్సి ఉంటుంది. దాదాపు రూ.1730 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాహుబలి 2 సౌతిండియా టాప్ గ్రాసర్ గా నిలిచింది.
బాహుబలి 2 తర్వాత బాహుబలి -565 కోట్ల తో రెండో స్థానంలో ఉంది. ఎంథిరన్ (రోబో)-285కోట్లు - కబాలి-282 కోట్లు - మెర్సల్ -255కోట్లు - సర్కార్ -250కోట్లు - ఐ-230కోట్లు - రంగస్థలం-213కోట్లు - ఖైదీనంబర్ 150-161కోట్లు - తేరి- 155కోట్లు - కాలా-155కోట్లు - శివాజీ- 150కోట్లు - ఏఎస్ వీఆర్- 144కోట్లు - శ్రీమంతుడు-144కోట్ల తో టాప్ 15 స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు 2.ఓ చిత్రం ఎంథీరన్ రికార్డుతో పాటు బాహుబలి సిరీస్ రికార్డుల్ని వేటాడుతుందా.. లేదా? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ 2.ఓ ఏ స్థానం ఆక్రమిస్తుంది? తొలిరోజు రికార్డులు - తొలి వీకెండ్ - తొలివారం రికార్డుల్లో ఏ స్థానంలో నిలుస్తుందో చూడాలి.