Begin typing your search above and press return to search.
విశ్వరూపం- 220కోట్లు - పార్ట్ 2 సీనెంత?
By: Tupaki Desk | 8 Aug 2018 5:19 PM GMTయూనివర్శల్ హీరో కమల్ హాసన్ నటించిన `విశ్వరూపం 2` ప్రపంచవ్యాప్తంగా ఈనెల 10న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషయంలో ఊహించని సస్పెన్స్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని చిత్రబృందం తాజా ప్రకటనలో ఖండించింది. ఈ సినిమాని పలు భాషల్లో అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్న కారణంగా వాయిదా వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని - అందుకే రిలీజ్ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక సినిమా వాయిదా నిజం కాదని తేలిపోయింది.
మరో 36 గంటల్లోనే `విశ్వరూపం 2`పై ప్రివ్యూల నుంచి టాక్ వచ్చేయనుంది. శుక్రవారం రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా యథాతథంగా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ సందర్భంగా పార్ట్ 2 కలెక్షన్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తికర చర్చ ట్రేడ్ లో సాగుతోంది. విశ్వరూపం పార్ట్ 1 నెలరోజులు పైగా ఆడి - ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు వసూలు చేసింది. దాదాపు 95 కోట్ల బడ్జెట్ ని పార్ట్-1 కోసం ఖర్చు చేశారు. అప్పుడు రిలీజ్ వేళ ఎన్నో సందిగ్ధతలు... ఎన్నో ఆటంకాలు .. ఎన్నో సంక్లిష్ఠతలు.. రిలీజ్ వరకూ సందేహమే. ఎన్నో కష్టాల మధ్య రిలీజై బంపర్ హిట్ కొట్టింది.
ఆ సన్నివేశం ఇప్పుడు లేదు. విశ్వరూపం 2 విషయంలో కమల్ హాసన్ కి అన్నిరకాలా లైన్ క్లియరైంది. కోర్టుల పరిధిలో గొడవలేం లేవు. అయితే కరుణానిధి మరణం వల్ల తమిళనాడు వ్యాప్తంగా పెద్దాయన అభిమానుల్లో ఆవేదన నెలకొని ఉంది. అదొక్కటే కాస్తంత మైనస్ కావొచ్చేమో కానీ, ఈ సినిమా రిలీజ్ కి అష్ట గండాలు లేనేలేవని తేలిపోయింది. ఇక పార్ట్ 2 కి హిందీ రిలీజ్ పైనా భారీ అంచనాలుండడంతో తొలి భాగం కంటే పెద్ద విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 10న రిలీజ్ యథాతథం అంటూ `విశ్వరూపం 2` టీమ్ కాన్ఫిడెంట్ గా ప్రకటించడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ మొదలైంది. ట్రైలర్లకు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చా సాగుతోంది.