Begin typing your search above and press return to search.

సాహో ప్రీబిజినెస్ పై ట్రేడ్ రిపోర్ట్

By:  Tupaki Desk   |   15 Aug 2019 5:13 AM GMT
సాహో ప్రీబిజినెస్ పై ట్రేడ్ రిపోర్ట్
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా సినిమా `సాహో`. సుజీత్ ద‌ర్శ‌కుడు. యు.వి.క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌మోద్-వంశీ నిర్మిస్తున్నారు. ఆగ‌స్టు 30న సినిమా రిలీజ‌వుతోది. సాహో రాక‌ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్.. మేకింగ్ వీడియోలు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. అందుకు త‌గ్గ‌ట్టే సాహో ప్రీరిలీజ్ బిజినెస్ లోనూ అంతే స్పీడ్ క‌నిపిస్తోంద‌నేది ట్రేడ్ రిపోర్ట్.

ప్రాంతాల వారీగా ప్రి రిలీజ్ బిజినెస్ వివ‌రాలు ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులివి. నైజాం- 40 కోట్లు..సీడెడ్ -25కోట్లు.. నెల్లూరు- 4.50కోట్లు..కృష్ణా -8కోట్లు.. గుంటూరు-12.50 కోట్లు.. వైజాగ్ -16కోట్లు.. తూ.గో జిల్లా..ప‌.గో.జిల్లా కలిపి - 19కోట్లు.. కర్ణాటక - 28కోట్లు.. తమిళనాడు- కేరళ కలిపి -18కోట్లు.. బిజినెస్ సాగించింది. మొత్తం ఆంధ్రా, తెలంగాణా 125 కోట్ల మేర బిజినెస్ చేసింది. నార్త్ ఇండియా మొత్తం 120 కోట్ల మేర బిజినెస్ సాగింది. అలాగే ఓవర్ సీస్ హ‌క్కుల్ని(చైనా మిన‌హా) 42 కోట్ల‌కు దుబాయ్ కి చెందిన ఫ‌ర్స్ ఫిలింస్ సంస్థ ఛేజిక్కించుకుంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 333కోట్ల మేర ప్రీరిలీజ్‌ బిజినెస్ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. దాదాపు 350కోట్ల మేర బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌భాస్ వెల్ల‌డించారు. అంటే మ‌రో 27 కోట్ల మేర లోటుతోనే రిలీజ్ చేస్తున్నార‌ని భావించ‌వ‌చ్చు.

అయితే సాహో కి రక‌ర‌కాల మార్గాల్లో నాన్ థియేట్రిక‌ల్ రూపంలో భారీ మొత్తాలు నిర్మాత‌ల‌కు ద‌క్క‌నున్నాయి. శాటిలైట్ రైట్స్.. ఆడియో రైట్స్ వ‌గైరా హ‌క్కుల‌కు భారీ మొత్తాలు చేతికి అంద‌నున్నాయ‌ని తెలుస్తోంది. రిలీజ్ ముందు యు.వి.క్రియేష‌న్స్ సేఫ్ గేమ్ ఆడిన‌ట్టేన‌న్న మాటా వినిపిస్తోంది. భారీ ధ‌ర‌ల‌కు త‌గ్గ‌ట్టే సినిమా హిట్టు టాక్ తెచ్చుకుంటే తొలి వారంలోనే పంపిణీదారుల‌కు పెట్టుబ‌డుల్లో మెజారిటీ పార్ట్ వెన‌క్కి వ‌స్తుంద‌నే భావించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ తో వ‌చ్చిన క్రేజుతో ఈ సినిమా ఓపెనింగుల‌పైనా భారీ అంచ‌నాలున్నాయి.