Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి
By: Tupaki Desk | 9 Nov 2022 7:00 AM GMT2020 నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా సమయంలో ఎంతో మంది దిగ్గజ నటీనటులు.. నిర్మాతలు.. డైరెక్టర్లు మృత్యువాతపడ్డారు. కరోనాతో కొంతమంది చనిపోతే.. అనారోగ్య.. వ్యక్తిగత కారణాలతో మరికొందరు చనిపోవడం చిత్రసీమలో విషాదం నింపింది.
తాజాగా కన్నడ చిత్రసీమకు చెందిన సీనియర్ నటుడు లోహితస్వ ప్రసాద్(80) మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లోహితస్వ ప్రసాద్ బెంగూళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
ఇంగ్లీష్ ఫ్రొపెసర్ అయిన లోహితస్వ ప్రసాద్ నటనపై మక్కువతో సినిమా రంగంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటించే చాన్స్ దక్కించుకున్నారు. ఏకే 47.. దాదా.. దేవ.. నీ బరేడ కాదంబరి సంగ్లియానా వంటి సినిమాలతో లోహితస్వ ప్రసాద్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
500లకు పైగా కన్నడ చిత్రాల్లో నటించిన లోహితస్వ ప్రసాద్ పలు సీరియల్స్ లో నటించారు. అంతిమ రాజా.. గ్రుహంబంగ.. మాల్గుడి డేస్.. వంటి సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను దగ్గరయ్యాడు. లోహితస్వ ప్రసాద్ కుమారుడు శరత్ లోహితస్వ కూడా చిత్రసీమలో నటుడిగా రాణిస్తున్నాడు.
శరత్ లోహితస్వ తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితమే. జై లవకుశ.. సాహో.. అరవింద సమేత వీర రాఘవ సినిమాల్లో శరత్ లోహితస్వ నటించారు. బాలకృష్ణ ‘అఖండ’ మూవీలో ఎన్ఐఏ ఆఫీసర్ శరత్ లోహితస్వ కన్పించి ఆకట్టుకున్నాడు. కాగా లోహితస్వ ప్రసాద్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.