Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: 2019 ముగింపు తూతూ గానే

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:06 AM GMT
టాప్ స్టోరి: 2019 ముగింపు తూతూ గానే
X
డిసెంబ‌ర్ ఎండింగ్ ఇది. 2019 కి టాటా చెప్పి 2020కి వెల్ కం చెప్పే గ్రేట్ మూవ్ మెంట్ కోసం యూత్ వెయిటింగ్. అయితే ఈ ఏడాది ని ఘ‌నంగా ముగించేందుకు టాలీవుడ్ సిద్ధంగా ఉందా? అంటే ఎండింగ్ ఏమంత బాలేద‌న్న‌ది ట్రేడ్ రిపోర్ట్. ఈ ఏడాది హిట్ల‌తో ముగించి.. కొత్త ఏడాదిని ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌కాల‌ని చాలా మంది ఉత్సాహ‌ ప‌డినా ఆశించిన రిజ‌ల్ట్ లేదు. మొన్న (డిసెంబ‌ర్) 20న నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ్డాయి. బాల‌కృష్ణ న‌టించిన `రూల‌ర్‌`.. సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌ న‌టించిన `ప్ర‌తిరోజు పండ‌గే`.. కార్తి న‌టించిన `గొంగ‌`.. స‌ల్మాన్‌ ఖాన్ `ద‌బాంగ్‌3` పోటీ ప‌డ్డాయి. ఈ నాలుగు చిత్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఏదీ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌ లేక‌పోయాయి.

ఉన్న వాటిలో సాయి తేజ్ న‌టించిన‌ ప్ర‌తిరోజూ పండ‌గే ఫ‌ర్వాలేద‌నిపించినా.. మాస్ ని కొంత వ‌ర‌కు స‌ల్మాన్ న‌టించిన ద‌బాంగ్ .. కార్తి దొంగ తెలుగు ఆడియెన్ ని నిరాశ‌ప‌రిచాయి. బాల‌కృష్ణ రూల‌ర్ ఏకంగా డిజాస్ట‌ర్ వైపు ప్ర‌యాణిస్తోంది అంటూ సోష‌ల్ మీడియా లో ప్ర‌చార‌మ‌వుతోంది. ఇక నాలుగో వారం ప‌రిస్థితి ఏమిటి? అంటే.. చివ‌రిగా రిలీజ‌వుతున్న సినిమాల లిస్ట్ కాస్త పెద్ద‌ గానే వుంది. డిసెంబ‌ర్ 25న రాజ్ త‌రుణ్ న‌టించిన `ఇద్ద‌రి లోకం ఒక‌టే`.. రాజ‌మౌళి ఫ్యామిలీ హీరో న‌టించిన `మ‌త్తు వ‌ద‌ల‌రా` విడుద‌ల‌వుతుండ‌గా.. డిసెంబ‌ర్ 26న అక్ష‌రం.. డిసెంబ‌ర్ 27న న‌వీన్ చంద్ర `హీరో హీరోయిన్‌`.. త‌మిళ డ‌బ్బింగ్ సినిమా `పిజ్జా 3`.. ధ‌నుష్- గౌత‌మ్ మీన‌న్ కంబో `తూటా`.. డిసెంబ‌ర్ 28న సుడిగాలి సుధీర్ హీరో గా ఎంట్రీ ఇస్తున్న `సాఫ్ట్‌ వేర్ సుధీర్‌`.. వీటితో పాటు `స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్` చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

ఈ లైనప్ లో ఏ సినిమా కూ పెద్ద‌గా క్రేజ్ లేదు. అస‌లే పబ్లిసిటీ లేకుండా వ‌స్తున్న చిత్రాలివి. ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇద్ద‌రి లోకం ఒక‌టే.. మ‌త్తు వ‌ద‌ల‌రా వంటి చిత్రాల‌కు ప్ర‌మోష‌న్ మొద‌లుపెట్టారు. అదీ సోష‌ల్ మీడియాని న‌మ్మి ఇత‌ర ప‌బ్లిసిటీ జోలికి వెళ్లిన‌ట్టు లేదు. ఆ సినిమాలు వ‌స్తున్నాయ‌న్న సంగ‌తే సామాన్య ప్రేక్ష‌కుడికి తెలియ‌దు. మ‌త్తు వ‌ద‌ల‌రా కోసం రాజ‌మౌళి ని రంగంలోకి దింపి ట్వీట్ ప‌డేలా చేశారు. రాజ్ త‌రుణ్ సినిమాపై అస‌లు బ‌జ్ ఏ మాత్రం లేదు. ఇక ధ‌నుష్- గౌత‌మ్ మీన‌న్ ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న `తూటా` గురించి తూటా స్టైల్లో చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా కోసం గౌత‌మ్ మీన‌న్ ఎంత‌గానో శ్ర‌మించారు. కానీ రిలీజ్ ముందు ప్ర‌చారం ఏదీ? ఇక ఇత‌ర సినిమాల గురించి అస‌లే బ‌జ్ లేదు.