Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: పునర్జన్మల నేపథ్యంలో.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'

By:  Tupaki Desk   |   21 Jan 2021 1:05 PM GMT
ట్రైలర్ టాక్: పునర్జన్మల నేపథ్యంలో.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?
X
టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు సినీహీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా '30రోజులలో ప్రేమించడం ఎలా?'. గతేడాది స్టార్టింగ్ లో ఈ సినిమా నుండి ఒక సాంగ్ విడుదలైంది. 'నీలినీలి ఆకాశం' అంటూ సాగే ఆ మెలోడీ సాంగ్ యూట్యూబ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన సంగతే. అయితే ఆ పాటతో ఈ సినిమా పై అంచనాలు బాగానే నెలకొన్నాయి. అయితే విడుదలయ్యే సమయానికి లాక్ డౌన్ రావడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. అమృత అయ్యర్ ఈ సినిమాతో కథానాయికగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. అయితే ఇటీవల విడుదల తేదీ ప్రకటించిన ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా నీలినీలి ఆకాశం సాంగ్ లో ఉన్నట్లు పల్లెటూరు కథతో ఉండబోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకో ట్రైలర్ చూసాక అర్ధమవుతుంది. ఇక విడుదలైన ట్రైలర్ విషయానికి వస్తే.. 'నువ్ వదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే' అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. కాలేజీ సన్నివేశాలతో హీరోహీరోయిన్లను పరిచయం చేసాడు డైరెక్టర్. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఆకట్టుకునేలా అనిపిస్తుంది. అయితే ఫ్లాష్ బ్యాక్, ప్రెజెంట్ జనరేషన్ ప్రేమకథలను చూపించడానికి ట్రై చేస్తున్నట్లున్నారు. రెండు లవ్ స్టోరీలు డిఫెరెంట్ గా ఉన్నాయి. కానీ ప్రెసెంట్ లవ్ స్టోరీలో మాత్రం ఒకరంటే ఒకరికి పడదని అర్ధమవుతుంది. అలాంటి ఇద్దరూ 30 రోజుల్లో ఎలా ప్రేమించుకున్నారు? అనే కాన్సెప్ట్ తో పునర్జన్మల నేపథ్యంలో సినిమా రూపొందిందని పక్కా అనిపిస్తుంది.

నిజానికి ట్రైలర్ రొటీన్ గానే మొదలైనా ముందుకు వెళ్ళేకొద్దీ పునర్జన్మ లవ్ స్టోరీ యాడ్ అయ్యేసరికి ఆసక్తికరంగా మారింది. ఇక చివరలో మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.. మేం 30రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా? అంటూ టైటిల్ ను జస్టిఫై చేస్తూ ఎండ్ చేశారు. ఇక ట్రైలర్ లో ప్రదీప్ వెటకారం, అమృత అందాల ఆరబోత మాత్రం హైలైట్ అవుతోంది. అంతేగాక ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ కూడా ఉందని ట్రైలర్ లో చూపించేశారు. మొత్తానికి అమృత గ్లామర్ షో అదిరిపోతుందని చెప్పవచ్చు. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్, గీతాఆర్ట్స్ వారు ఈ నెల 29న థియేట్రికల్ విడుదల చేయనున్నారు. ఎస్వి బాబు నిర్మిస్తున్న ఈ సినిమాతో డైరెక్టర్ మున్నా తెలుగులో డెబ్యూ అవుతున్నాడు. చూడాలి మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో..!