Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: వైఫ్.. మిస్సింగ్ సర్ అంటున్న టెంప్ట్ రవి!
By: Tupaki Desk | 26 Nov 2019 9:10 AM GMT'ఏడు చేపల కథ' లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు మరో సినిమా తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా 'వైఫ్,ఐ' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్.
ట్రైలర్ ఆరంభం లో అభిషేక్ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు.. అక్కడున్న పోలీస్ తో 'కంప్లయింటు.." అంటాడు. ఆ పోలీస్ ఫోన్ లో మాట్లాడుతూ ఎంతో రొటీన్ గా 'కూచొ' అంటాడు. "వైఫ్.. మిస్సింగ్ సర్" అంటూ తన వెర్షన్ చెప్తాడు. పోలీసు ఆఫీసర్ మరికొన్ని ప్రశ్నలు వేస్తాడు. కొన్ని షాట్స్ లో ఫిదా గిల్ తో ప్రేమ.. తర్వాత గొడవలు లాంటివి చూపించారు. ఇక "ఇల్లీగల్ ఎఫైర్స్ ఏవైనా ఉన్నాయా?" అని పోలీస్ ప్రశ్నించగానే అభిషేక్-గుంజన్ మధ్య జరిగిన మరపురాని రాత్రులకు సంబంధించిన మహా బోల్డ్ షాట్స్ చూపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి సీన్ ఒక ఓపెన్ ప్లేస్ లో రోడ్ కు మారుతుంది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే రోడ్ మీద ఒక బీర్ బాటిల్ పగలగొట్టి బాజీగర్ షారూఖ్ తరహాలో "వైఫ్ అన్నాను కానీ నా వైఫ్ అన్నానా?" అంటూ అభిషేక్ ఒక విలన్ తరహా లో పెద్ద గా నవ్వుతాడు.
ఫిదా గిల్ తో ప్రేమ.. పెళ్లి.. ఆ తర్వాత గుంజన్ తో అక్రమ సంబంధం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టొరీలైన్ లాగా అనిపిస్తోంది. ఈ పాయింట్ లోనే బోల్డు బోల్డ్ సీన్స్ కు స్కోప్ ఉంది కదా. అందుకే ఫుల్ గా దట్టించారు. అసలు అభిషేక్ - గుంజన్ మధ్య హాట్ సీన్లు చూస్తే బాలీవుడ్ ఇమ్రాన్ హష్మి కూడా సిగ్గుతో బిక్కచచ్చిపోతాడు! సరే.. మన టాలీవుడ్ కూడా ఎదిగింది కదా అని సంతోషించాలి. టీజర్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. సంప్రదాయవాదుల నసను.. సణుగుడును పక్కనపెడితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేదిలా ఉంది. ఆలస్యం ఎందుకు.. చూసేయండి.. కొన్ని షాట్లలో లోతు అర్థం కావాలంటే స్లో మోషన్ లోనో.. రిపీట్ మోడ్ లోనో చూడండి. లేకపోతే అభిషేక్ గారి రసికతను క్యాచ్ చెయ్యలేరు!