Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: చూసి చూడంగానే క్యూట్ గా ఉందే
By: Tupaki Desk | 4 Dec 2019 4:57 AM GMTనిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న చిత్రం 'చూసి చూడంగానే'. శేష సింధు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ.. మాళవిక సతీశన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదల అయింది.
"మా అమ్మ చెప్పిందని ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాను. నచ్చక డిస్కంటిన్యూ చేశాను. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేద్దామనుకుని వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను" అంటూ హీరో వాయిస్ ఓవర్ లో తన ఇంట్రో ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అంటే హీరో అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటి అన్నమాట. ఇక హీరో రెండు ప్రేమాయణాల గురించి కొంచెం హింట్ ఇచ్చారు. "నాకు కాలేజ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నన్ను లైఫ్ లో లవ్ చేసిన ఫస్ట్ అమ్మాయి తనే" అంటూ ఆ ముచ్చట కూడా హీరోనే చెప్పుకున్నాడు. అంటే దీనర్థంసెకండ్ లవ్.. సెకండ్ అమ్మాయి ఉందనే కదా. సరే సెకండ్ అమ్మాయి సంగతి తర్వాత చెప్పుకుందాం. ముందు ఫస్ట్ అమ్మాయి గురించి కొంచెం ఇంట్రో చెప్పుకుంటే.. హీరో అమ్మాయి దగ్గరకు వెళ్లి "మీ పేరు..ఇంకా మీ బ్రాంచ్ చెప్తారా" అని అడిగితే "ఎందుకు?' అని హీరోయిన్ ప్రశ్న వేస్తుంది. "సీనియర్స్ కనుక్కుని రమ్మన్నారు" అంటూ హీరో చెప్తాడు.. అప్పుడు "ఐశ్వర్య 8000492... " అంటూ అడిషనల్ ఇన్ఫో ఇస్తుంది. దీంతో కాస్త సర్ ప్రైజ్ అయిన హీరో "వాళ్ళు మీ నంబర్ అడగలేదు" అంటూ ఒక అందమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. హీరోయిన్ అంతకంటే క్యూట్ గా "నేనూ వాళ్ళకివ్వమని చెప్పలేదే" అంటూ చిలిపి జవాబిస్తుంది.
సెకండ్ అమ్మాయిని కూడా కాస్త బోల్డ్ గానే ఇంట్రో ఇచ్చారు. "చాక్లెట్లు నాకు అస్సలు నచ్చవు.. నెక్స్ట్ టైమ్ నుంచి విస్కీ బాటిల్ తీసుకునిరా" అంటూ హీరోకే ఆర్డర్ వేస్తుంది ఆ నారీమణి. హీరోయిన్ల సంగతే కాదు.. ట్రైలర్ లో సందర్భానుసారం వచ్చే కామెడీ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. హీరో అమ్మగారు హీరో ర్యాంక్ గురించి "అదేంటి ర్యాంకా.. ఫోన్ నంబరా?" అని అవాక్కవుతూ అరవడం లాంటి సీన్లు బాగున్నాయి.
ఓవరాల్ గా న్యూ జెన్ ఆడియన్స్ కు నచ్చే ట్రైలర్. గోపి సుందర్ నేపథ్య సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. విజువల్స్ ప్లెజెంట్ గా ఉన్నాయి. నటీ నటులు కొత్తవారైనా యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ చూసేయండి.