Begin typing your search above and press return to search.
అమ్మ రాజ్యం వదిలేసి డ్రాగన్ రాజ్యం వెళ్లిన వర్మ
By: Tupaki Desk | 13 Dec 2019 10:13 AM GMTరామ్ గోపాల్ వర్మ గత వారం పది రోజులుగా తన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా విడుదల విషయమై చాలా బిజీ బిజీగా గడిపాడు. ఆ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఆ సినిమాకు అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించేందుకు తన శక్తి వంచన మేరకు చాలా కష్ట పడ్డాడు. ఎట్టకేల కు నిన్న 'అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందంటూ స్వయంగా వర్మనే ప్రకటించుకున్నాడు.
నిన్నటి వరకు అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు అంటూ తెగ హడావుడి చేసిన వర్మ నేడు తన ఇండో చైనీస్ మూవీ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' సినిమా ఇంటర్నేషనల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం కోసం చైనా వెళ్లాడు. బ్రూస్ లీ పుట్టిన ప్రాంతం అయిన చైనాలోని పోషాన్ కు వర్మ వెళ్లాడు. నేడు మద్యాహ్నం సమయంలో ఈ సినిమా ఇంటర్నేషనల్ ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.
చైనీస్ మీడియా తో పాటు అంతర్జాతీయ మీడియా భారీగా హాజరు అయిన ఆ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ.. ఒకప్పుడు బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమాను చూసేందుకు సైకిల్ పై థియేటర్ కు వెళ్లే వాడిని. కాని ఇప్పుడు నేను బ్రూస్ లీ గురించి తీసిన సినిమా ట్రైలర్ ను ఆయన పాదాల వద్ద ఆవిష్కరించేందుకు విమానం ఎక్కి వచ్చానంటూ ఎమోషనల్ గా వ్యాఖ్యలు చేశాడు.
నిన్నటి వరకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ ఆయన చేసిన సినిమాపై ఎంతో మంది ట్రోల్స్ చేశారు. కాని ఇప్పుడు వర్మ తీసిన అంతర్జాతీయ స్థాయి మూవీ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' సినిమాని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన దక్కింది. వర్మ నుండి ఇలాంటి సినిమాలను ఆశిస్తున్నాం అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.